logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఏటీఎం వినియోగదారులకు ఆర్బీఐ షాక్..!

కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఏటీఎం వినియోగదారులకు అదనపు చార్జీలను వడ్డించనుంది. ఇటీవల ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ కొన్ని కీలక ప్రతిపాదనలను ఆర్బీఐ ముందుంచింది. ఒక వేళ ఈ ప్రతిపాదనలకు గనుక ఆర్బీఐ ఆమోదం లభిస్తే ఇకపై వినియోగదారుడు ఏటీఎం నుంచి కేవలం రూ. 5 వేలు మాత్రమే డ్రా చేయవలసి ఉంటుంది.

ఒకవేళ పరిమితికి మించి డబ్బులు డ్రా చేస్తే అదనపు చార్జీలను విదిస్తుంది. ఈ మేరకు 10 లక్షల జనాభా గల ప్రాంతాల్లో అన్ని ఏటీఎం లావాదేవీలపై 24 శాతం చార్జీలను పెంచాల్సిందిగా కమిటీ తన నివేదికలో పేర్కొంది. కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆర్బీఐ కమిటీ ప్రతిపాదనలకే ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు నియంత్రించాలంటూ గగ్గోలు పెడుతున్న సామాన్యుడిపై ఆర్బీఐ మరింత భారం మోపడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తుంది.

Related News