logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

మాస్ మహారాజ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. ఆ మెగా హీరోతో సినిమా!

‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈసినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా చూపించాడు. క్రాక్ ఇచ్చిన కిక్కుతో ఫ్యూచర్ సినిమాలపై దృష్టి పెట్టాడు. తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న బజ్ ప్రకారం ఓ క్రేజీ కాంబినేషన్లో రవితేజ నెక్స్ట్ సినిమా ఉండబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రవితేజతో ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇటీవల ఏ ఇండస్ట్రీ చూసుకున్నా రీమేక్ ల జోరు కొనసాగుతుంది. ఏ బాషలో అయినా ఒక సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంటే వెంటనే ఆ సినిమా రీమేక్ హక్కులను కొనేస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. సొంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించిన రామ్ చరణ్ సినిమాలను కూడా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సొంత బ్యానర్ లో ‘ఆచార్య’ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటె మళయాళ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ హీరోగా వచ్చిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే సినిమా రీమేక్ హక్కులను చెర్రీ సొంతం చేసుకున్నాడు. 2019 లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకోవాలనుకున్న వ్యక్తికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. మంచి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రవితేజతో ప్లాన్ చేస్తున్నాడట రామ్ చరణ్.

రవితేజ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆలస్యం దర్శకుడిని కూడా వెతికే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడీ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు రవితేజ. మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై క్లారిటీ రావాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

Related News