logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

మూవీ రివ్యూ: రవితేజ ‘క్రాక్’ సినిమాతో హిట్టు కొట్టాడా?

నటీనటులు: రవితేజ, శృతిహాసన్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, సుధాకర్, వంశీ, సప్తగిరి
కథ, కథనం, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
సంగీతం:ఎస్ఎస్ థమన్
మాటలు: సాయి మాధవ్ బుర్రా
నిర్మాత: ఠాగూర్ మధు

అనిల్ రావి పూడి దర్శకత్వంలో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా తర్వాత రవితేజకు ఒక్క హిట్టు కూడా పడలేదు. ఆ తర్వాత వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమా కూడా నిరాశపరిచింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని నిర్ణయించుకున్న రవితేజ గతంలో తనకు సూపర్ డూపర్ హిట్లు అందించిన గోపీచంద్ మలినేని కాంబినేషన్ ను రిపీట్ చేసాడు. సంక్రాంతి సందర్భంగా రవితేజ ‘క్రాక్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం..

కథ:
పోతరాజు వీర శంకర్ (రవితేజ) కర్నూల్ ఎస్ఐ గా పనిచేస్తుంటాడు. బ్యాక్ గ్రౌండ్ ఉందని విర్రవీగే వారంటే పడదు. ఇతను ఎక్కడ పని చేస్తే అక్కడ లోకల్ రౌడీలను ఏరి పారేస్తుంటాడు. అలా కర్నూలు కడప ఒంగోలులో రౌడీలతో తనదైన శైలిలో వైరం పెట్టుకుంటాడు. అందులో ఒంగోలుకు చెందిన కటారి (సముద్రఖని) చాలా చాలా పవర్ ఫుల్. అతనంటే చుట్టూ పక్కల 20 గ్రామాలు వణికిపోతాయి. అలాంటి వ్యక్తితో సిఐ వీర శంకర్ తలపడతాడు. తన సహోద్యోగి కుమారుడి చావుకు కారణాలు వెతికే పనిలో కఠారితో మరింత వైరం పెరుగుతుంది. ఈ క్రమంలో వీర శంకర్ ను చంపడానికి కటారి రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. వీర శంకర్ కటారి లకు మధ్య గొడవ ఏమిటి? సినిమాలో చివరకు ఏం జరుగుతుంది? అనేది మిగిలిన కథాంశం.

విశ్లేషణ:
ముందుగా సినిమాలో నటీనటుల గురించి చెప్పుకుంటే.. సినిమా మొత్తాన్ని మాస్ మహారాజా రవితేజ తన భుజాలపై మోసాడనే చెప్పాలి. రవి తేజను ఆయన అభిమానులు ఎలా చూడాలని అనుకుంటారో దర్శకుడు గోపీచంద్ మలినేని అలాగే చూపించాడు. పోత రాజు వీర శంకర్ పాత్రలో రవి తేజ తనలోని ఫైర్ ను మరోసారి చూపించాడు. క్రాక్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు రవితేజ. పవర్ ఫుల్ డైలాగులతో, ఎనర్జిటిక్ డాన్సులతో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ఫుల్ లెన్త్ మాస్ ఎంటర్ టైన్మెంట్ ను పంచాడు. తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు. నాలుగేళ్ళ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కు మంచి రోల్ ఇచ్చి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యం లేకపోయినా సెకండ్ హాఫ్ లో హీరోయిన్ పాత్రకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ ను చూపించి ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. విలన్ కటారి పాత్రలో తమిళ దర్శకుడు సముద్రఖని చాలా వైవిధ్యంగా కనిపిస్తాడు. కటారి సెటప్ గా కనిపించిన వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో అదరగొట్టింది. తెలుగులో పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఆమెకు ఈ ఒక్క సినిమాతో సంపాదించుకుందనే చెప్పాలి. హ్యాపీ డేస్ ద్వారా పరిచయమైన వంశీ, సుధాకర్ లకు మంచి పాత్రలు దక్కాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని కొడుకు ఈ సినిమాలో రవితేజకు కొడుకుగా నటించి నవ్వులు పూయించారు.

ఈ సినిమాతో రవితేజ కెరీర్ లో మరో హిట్టు చేరిందనే చెప్పాలి. కథ కాస్త రొటీన్ గా ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కథ రాసుకోవడం.. రొటీన్ కథనే విభిన్నంగా ప్రజెంట్ చేయడం ఆకట్టుకుంటాయి. మామిడికాయలో మీకు గుచ్చి, యాభై రూపాయల నోటు దాని పై పెట్టి కథను మొదలు పెట్టడం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ఇలాంటి సిల్లీ సన్నివేశాల సినిమాలో కొన్ని చోట్ల కనిపిస్తాయి. హీరో ఒక చిన్న ఆధారంతో టెర్రరిస్టు పట్టుకోవడం, కథలో తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ముందగానే ఊహించేలా ఉండే మరి కొన్ని సీన్లు రొటీన్ గా అనిపిస్తాయి. సినిమాకు థమన్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. రామ్ లక్ష్మణ్ తెరకెక్కించిన యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. కథను దర్శకుడు కొత్తగా ప్రెజంట్ చేయడానికి చేసిన ప్రయత్నం ఫలించింది. అందుకే కథలో కొత్తదనం లేకపోయినా మాస్ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోగలదు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుందనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. తెలిసిన కథే కావడం మైనస్ పాయింట్ గా నిలుస్తుది. కొన్ని సన్నివేశాలు సిల్లీగా అనిపించడం కూడా సినిమాలో మైన్స్ పాయింట్స్ గా నిలిచాయి.

ప్లస్ పాయింట్స్:
రవి తేజ నటన, థమన్ మ్యూజిక్, యాక్షన్ సన్నీవేషాలు క్రాక్ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

రేటింగ్: క్రాక్ సినిమాకు 3. 5 రేటింగ్ ఇవ్వచ్చు.

Related News