మాస్ మహారాజ రవితేజ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపిస్తున్న సినిమా ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే గోపిచంద్ మలినేని- రవితేజ కాంబినేషన్లో ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి మాస్ ఎంటర్టైనర్లు తెరకెక్కిన విషయం తెలిసిందే.’
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసారు. హీరో దగ్గుబాటి వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవ్వడం విశేషం. ఇక రవి తేజకు సూటయ్యే మాస్ డైలాగులు ట్రైలర్ లో అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. రవి తేజకు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక విలన్ పాత్రలో సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి నటిస్తుంది. ఈ సినిమాను ముందుగా సంక్రాంతి సందర్భంగా జనవరి 14 న విడుదల చేస్తామని ప్రకటించిన సినిమా టీమ్ ఇప్పుడు నాలుగు రోజులు ముందుగానే జనవరి 9న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక ఎలాగో ఈసారి పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో క్రాక్ సినిమా హిట్టు కొట్టడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు.