logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రామారావు, ఖిలాడి సినిమాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు సినిమాల త‌ర్వాత ఆయ‌న ఒక బ‌యోపిక్ ఒప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. బ‌యోపిక్ అంటే ఏ లీడ‌ర్‌దో, యాక్ట‌ర్‌దో, ఆఫీస‌ర్‌దో కాదు. ఒక దొంగ బ‌యోపిక్‌లో ర‌వితేజ న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో ర‌వితేజ క్రూర‌మైన ఓ దొంగ‌గా క‌నిపించ‌బోతున్నాడు. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనే ఒక గ‌జ‌దొంగ క‌థ ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

1970ల‌లో వ‌రుస దొంగ‌త‌నాలు, దోపిడీల‌కు పాల్ప‌డి ప్ర‌జ‌లు, పోలీసుల‌కు కంటి మీద కునుకు లేకుండా చేసి స్టూవ‌ర్టుపురానికి చెందిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. ఈయ‌న జీవితం ఒక సినిమాకు స‌రిపోయే క‌థ కావ‌డంతో చాలా రోజులుగా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్ తీయాల‌ని ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. గ‌తంలో బెల్లంకోండ సాయి శ్రీనివాస్ హీరోగా డైరెక్ట‌ర్ వంశీకృష్ణ నాయుడు ఈ సినిమా తీయాల‌నుకున్నారు.

ఆ త‌ర్వాత హీరో ద‌గ్గుబాటి రానా ఈ సినిమాలో న‌టించ‌నున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే, ఇప్పుడు ఈ క‌థ ర‌వితేజ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. క‌థ బాగుండ‌టంతో ర‌వితేజ ఇందులో న‌టించేందుకు వెంట‌నే ఒప్పేసుకున్నాడ‌ట‌. నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్ భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

1970వ ద‌శ‌కంలో టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పేరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అంతా మారుమ్రోగింది. నిజానికి ఆయ‌న క‌రుడుగ‌ట్టిన దొంగే అయినా కూడా రాబిన్ హుడ్ లాంటివార‌ని చెబుతారు. ఉన్న వారిని దోచుకొని లేని వారికి పంచిపెట్ట‌డం నాగేశ్వ‌ర‌రావు నైజం అనే ప్ర‌చారం ఉంది. చాలా మంది పేద‌ల పిల్ల‌లను నాగేశ్వ‌ర‌రావు చ‌దివించేవాడ‌ని కూడా చెబుతారు.

చిన్న‌తనంలో ఆయ‌న‌కు చ‌దువుకోవాల‌ని ఉన్నా కూడా ఆనాటి ప‌రిస్థితుల కార‌ణంగా నాగేశ్వ‌ర‌రావు చ‌దువుకోలేద‌ని, కాబ‌ట్టి త‌న ప్రాంతానికి చెందిన పేద పిల్ల‌లు బాగా చ‌దువుకోవాల‌ని నాగేశ్వ‌ర‌రావు అనుకునేవాడ‌నే క‌థ ప్ర‌చారంలో ఉంది. అందుకే, ఆయ‌న దోపిడీలు చేసి సంపాదించే డ‌బ్బులు పిల్ల‌ల చ‌దువుల కోసం ఖ‌ర్చు పెట్టేవాడ‌ని చెబుతారు.

నాగేశ్వ‌ర‌రావును ప‌ట్టుకునేందుకు పోలీసులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఆయ‌న త‌ప్పించుకునేవాడ‌ట‌. ఓసారి ఏకంగా చెన్నై జైలు నుంచే త‌ప్పించుకున్నాడ‌ని, అప్ప‌టి నుంచే అత‌డిని టైగ‌ర్ అని అన‌డం ప్రారంభించార‌ని చెబుతారు. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు 1987లో పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించాడు. ఇప్పుడు ఆయ‌న క‌థ సినిమా ద్వారా ఇప్ప‌టి త‌రానికి తెలియ‌నుంది.

Related News
%d bloggers like this: