logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

టాలీవుడ్ సీనియర్ నటుడు రావి కొండల్ రావు ఇకలేరు!

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి రావి కొండల్ రావు మరణించారు. హైదరాబాద్ బేగం పెట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. నటుడిగా, రచయితగా, జర్నలిస్టుగా రావి కొండల్ రావు ఎన్నో బాధ్యతలు నిర్వహించారు.

తమిళ, మలయాళ సినిమాలకు డబ్బింగ్ చెప్పి ఎంతో మంది నటులకు గాత్ర దానం చేసారు. 1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో కొండల్ రావు జన్మించారు. 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా కొంత కలం పని చేశారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్న సమయంలోనే ఆయనకు నటి రాధా కుమారి పరిచయం అయ్యారు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా 2012 లో ఆమె అనారోగ్యంతో మరణించారు. రావి కొండల్ రావు మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News