logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

హాట్ టాపిక్ గా మారిన మాజీ లవర్స్.. సోషల్ మీడియాలో రచ్చ!

రష్మిక మందన్నా ప్రేమ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 20 ఏళ్ల వయసులో కన్నడ స్టార్ హీరో, రచయిత, నిర్మాత రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక. రష్మికకు మొదటి సినిమా అవకాశం ఇచ్చింది కూడా రక్షిత్ శెట్టినే. అయితే ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ వెంటనే వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు.

అయితే వీరిద్దరూ ఆ తర్వాత తమ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అభిమానులకు షాకిచ్చారు. కారణాలు ఏమిటనేది ఇప్పటికీ తెలియదు. కానీ రశ్మికను మాత్రం ఆ హీరో ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేసారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్మిక ప్రేమలో పడిందని అందుకే రక్షిత్ ను పక్కన పెట్టిందనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే వాటిని రష్మిక ఖండించింది. ఈ వ్యవహారంపై రశ్మికను నిందించడం సరికాదంటూ రక్షిత్ తన ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేసాడు కూడా. ఇక వీరిద్దరి మధ్య కూడా దూరం పెరిగింది. ఒకరి గురించి ఒకరు మాట్లాడటానికి కూడా యిష్టపడలేదు. అయితే తాజాగా వీరిద్దరూ మరోసారి వార్తల్లోకెక్కారు. అందుకు కారణం రష్మిక, రక్షిత్ కలిసి నటించిన కిరికి పార్టీ సినిమా ‘గురువారం సాయంకాలం’ పాట యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా రష్మిక ఒక పోస్టు పెట్టింది. అందులో రక్షిత్ శెట్టిని కూడా టాగ్ చేసింది. అంతేకాదు అందుకు ఆ హీరో కూడా స్పందించడం విశేషం. ‘ గ్రో గ్రో గర్ల్.. మే యువర్ ఆల్ డ్రీమ్స్ కమ్ ట్రూ’ (నీ కలలన్ని నిజమవ్వాలి) అని రక్షిత్ రిప్లై ఇచ్చాడు. దీంతో ఇన్నాళ్లకు వీరిద్దరి మధ్య మళ్ళీ సఖ్యత కుదిరిందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Related News