logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

పెళ్లిపై యువ క్రికెటర్ వ్యాఖ్యలు వైరల్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

ఆఫ్గనిస్తాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ హైదరాబాద్ సన్ రైజర్స్ తరపున ఆడి భారత్ లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. 21 ఏళ్ల ఈ యువ స్పిన్నర్ ప్రసుతం టీ 20 లలో ఐసీసీ నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇటీవల పెళ్లిపై ఇతను చేసిన వ్యాఖ్యలు అతన్ని ట్రోలింగ్ కు గురి చేశాయి. తాజాగా ఆఫ్గనిస్తాన్ అధికార రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగితే అతను ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘ పెళ్లి చేసుకుంటాను కానీ నా ఆఫ్గనిస్తాన్ దేశం ఐసీసీ వరల్డ్ క్రికెట్ కప్ గెలిచిన తర్వాతే’ అని సమాధానమిచ్చాడు. అతను చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో ఈ ప్రశ్న, జవాబులపై ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్లు. వరల్డ్ కప్ ఏమీ లూడో గేమ్ కాదని, రషీద్ తన మాటలపై నిలబయితే జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోతాడని అంటున్నారు.

రషీద్ వ్యాఖ్యలపై కొందరు అతన్ని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో పోలుస్తున్నారు. మరికొందరు పెళ్లి నుంచి తప్పించుకునేందుకు పెద్ద ప్లానే వేసాడని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. రషీద్ ఖాన్ తమ జట్టు తరపున ఓ వన్డే ప్రపంచ కప్‌, టీ 20 ప్రపంచ కప్‌ లో ఆడాడు. మొత్తంగా ఆఫ్గనిస్తాన్ రెండు వన్డే ప్రపంచ కప్ లలో, నాలుగు టీ20 ప్రపంచ కప్ లలో పాల్గొన్నది. కానీ టోర్నమెంట్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

Related News