logo

  BREAKING NEWS

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |  

మిహికాతో ప్రేమ, పెళ్లిపై రానా ఆసక్తికర కామెంట్స్..!

దగ్గుబాటి వారసుడు, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రానా పెళ్లి పీటలేక్కబోతున్న విషయం తెలిసిందే. స్నేహితురాలైన మిహికా బజాజ్ ను రానా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరిద్దరి వివాహం ఆగస్టు 8 వ తేదీన కరోనా నిబంధనల మేరకు జరగనుంది. ఇప్పటికే వీరికి సంబందించిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లు, పెళ్లి పత్రికలు వైరల్ గా మారాయి.

గతంలో రానా ప్రముఖ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. వీరికి సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విహరించాయి. ఆ విషయం పక్కన పెడితే రానాపై – మిహికల లవ్ స్టోరీ అనేక కథలు వినిపిస్తున్నాయి. దీనిపై రానా స్పందించాడు. మిహికాతో పరిచయం పెళ్లిపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

మిహికా బజాజ్ ఓ వ్యాపారస్తుల కుటుంబానికి చెందిన అమ్మాయి. వెంకటేష్ చిన్న కూతురు ఆశ్రిత- మిహికా స్నేహితులు. వీరి ద్వారా రానా కు మిహికాతో ఎప్పటినుంచో పరిచయం ఉంది. వీరిద్దరి నివాసాలు కూడా పక్కపక్కనే ఉండేవి. కొంత కాలం క్రితం రానా మిహికాను కలిసిన సందర్భంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఎందుకో ఆమెతో జీవితం చాలా సంతోషంగా ఉంటుందని అనిపించింది.

నాకు కూడా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అప్పటికే ఉంది. వెంటనే ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెప్పాలని ప్రయత్నించాను. ఒక రోజు ఆమెకు ఫోన్ చేశాను నేనేం చెప్పాలనుకుంటున్నానో తనకు కూడా తెలుసు. ఇద్దరం ఒక చోట కలిసి మాట్లాడుకున్నాము. ఈ పెళ్లి ప్రపోజల్ కి ముందు ఆమెతో అనేక విషయాలు చర్చించాను. ఆ తర్వాత వెంటనే నా ప్రేమ విషయం చెప్పాను.

మొదట మిహిక షాకయ్యింది. కానీ తర్వాత ఒప్పుకుంది. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది. మిహికతో పెళ్లి నా వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఒక అత్యుత్తమమైన నిర్ణయంగా భావిస్తున్నాను. ఇద్దరం ఒకరినొకరం గౌరవించుకుంటాము. ఒకరి అభిప్రాయాలంటే మరొకరికి చాలా సానుకూలదృక్పథం ఉంది. మేమిద్దరం మంచి జంటగా నిలుస్తామని రానా సంతోషం వ్యక్తం చేసాడు.

Related News