logo

  BREAKING NEWS

రామనాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ సీఎం జగన్!  |   మైండ్‌బ్లాక్ అయ్యే రీతిలో ”వ‌కీల్ సాబ్” రెమ్యున‌రేష‌న్‌  |   ఎమ్మెల్యేకు క‌రోనా.. ఏపీ అసెంబ్లీలో కోవిడ్ క‌ల‌వ‌రం  |   అంద‌రికీ వ్యాక్సిన్ అవ‌స‌రం లేదు… వ్యాక్సిన్ వ‌చ్చినా మాస్కులు త‌ప్ప‌వు  |   ఏపీ అసెంబ్లీ: చంద్రబాబు స్పీకర్ మధ్య మాటల యుద్ధం!  |   ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్ తీసేది రీమేక్ సినిమా.. ఇంత రిస్క్ ఎందుకు..?  |   ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!  |   పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాల‌ర్‌షిప్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవీ  |   బ్రేకింగ్: గ్రేటర్ లోని ఆ ప్రాంతంలో పోలింగ్ రద్దు: ఎన్నికల సంఘం  |   కేంద్రంపై రైతుల దండయాత్ర ఎందుకు? నూతన వ్యవసాయ చట్టాల్లో ఏముంది?  |  

ఇవాళే రానా ద‌గ్గుబాటి – మిహీక ఎంగేజ్‌మెంట్‌

లాక్‌డౌన్ వేళ టాలీవుడ్ హీరోలు ఓ ఇంటివాళ్లు అవుతున్నారు. ఇటీవ‌లే హీరో నిఖిల్ వివాహం జ‌ర‌గ‌గా ఇప్పుడు రానా ద‌గ్గుబాటి పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నాడు. ఇటీవ‌లే త‌న ప్రేమ‌ను త‌న ప్రేయ‌సి అంగీక‌రించింద‌ని సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించిన రానా ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకుంటున్నాడు. ఇవాళ సాయంత్రం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ద‌గ్గుబాటి రానా ఎంగేజ్‌మెంట్ జ‌ర‌గ‌నుంది.

ఇరు కుటుంబాల‌కు చెందిన ద‌గ్గ‌రి వారి మ‌ధ్య‌నే ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నారు. లాక్‌డౌన్ ఉండ‌టం, ఫంక్ష‌న్ల నిర్వ‌హ‌ణ‌పై ఆంక్ష‌లు ఉండ‌టంతో నిరాడంబ‌రంగా రానా నిశ్చితార్థం జ‌రుగుతోంది. కాగా, రానా కాబోయే భార్య మిహీక బ‌జాజ్‌. హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డ బంటీ బ‌జాజ్ – సురేశ్ బ‌జాజ్ కుమార్తె అయిన మిహీక ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం నిర్వ‌హిస్తున్నారు. చాలా రోజులుగా రానా – మిహీక మంచి స్నేహితులు. వీరి ఫ్రెండ్షిప్ ఇప్పుడు వివాహ‌బంధంగా మార‌బోతోంది.

Related News