logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

బాలీవుడ్ లో అది కాస్త ఎక్కువే.. రమ్యకృష్ణ కామెంట్స్!

బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణంతో చాలా మంది తారలు నేపోటిజం పై స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ ఇప్పటికీ ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఉత్తరాదిలో మాత్రం ఆమె ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు.

అందుకు గల కారణాలను ఆమె తాజాగా వివరించారు. బాలీవుడ్ లో రమ్యకృష్ణ ‘దయావాన్’, ‘పరంపర,‘ఖల్ నాయక్’, ‘చాహత్’, ‘బడేమియా చోటేమియా’ వంటి సినిమాల్లో నటించారు. అయితే అవేవీ తనకు ఆశించిన స్థాయిలో గుర్తింపునివ్వలేదన్నారు. ఆ తర్వాత కూడా తనకు బాలీవుడ్ లో ప్రాధాన్యం లేని పాత్రలే వచ్చాయని అందుకే అక్కడ ఎక్కువ సినిమాలు చేయలేదని తెలిపారు. తాజాగా రమ్యకృష్ణ మరోసారి అమితాబ్ బచ్చన్ తో నటించనున్నారు.

ఇక సుశాంత్ సింగ్ మరణంతో బాలీవుడ్ లో నేపోటిజం పై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం పై స్పంద్దిస్తూ.. బంధు ప్రీతీ లేనిదెక్కడ.. అన్ని రంగాల్లో ఉంది. కానీ బాలీవుడ్ లో అది కాస్త ఎక్కువగా ఉందని ఆమె కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం రమ్యకృష్ణ రానా దగ్గుబాటి ‘రంగమార్తాండ’, పూరి- విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమాలలో నటిస్తున్నారు. కాగా ఫైటర్ సినిమాకు బాలీవుడ్ లో నేపోటిజం విమర్శలు ఎదుర్కుంటున్న కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related News