హైద్రాబాద్ నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి పై దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేయర్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోను షేర్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వర్మ. కుక్కలను ప్రేమించే మేయర్ రేపు ప్రజలను కూడా కుక్కలాగే ప్రేమిస్తుందా అంటూ తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు.
తన పెంపుడు కుక్కకు ఆహారం తినిపిస్తున్న ఓ వీడియోని మేయర్ విజయలక్ష్మి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. కుడి చేత్తో కుక్కకు ఆహారం తినిపిస్తూ ఎడమ చేత్తో ఆమె తింటున్నారు. ఈ వీడియోపై వర్మ షాకింగ్ కామెంట్స్ చేసారు. సెల్ఫ్ లెస్ లవ్ కి ఇదే నిదర్శనం.. విజయలక్ష్మి గారిని కుక్కలకు ఇంటర్నేషనల్ మేయర్ ను చేయాలి.
గద్వాల్ విజయలక్ష్మి తాగి ఇలా కుక్కపై ప్రేమ చూపిస్తుందా లేదా కుక్కే తాగిందా అనే విషయం నాకు అర్థం కావడం లేదు. ఆమె ప్రజలపై కూడా ఇదే విధంగా ప్రేమను చూపిస్తుందా అనేది ప్రశ్నగా మారింది. ఆమె నాపై కూడా ఇలాంటి ప్రేమే చూపిస్తే వచ్చే జన్మలో నాకు కూడా కుక్కలా పుట్టాలని ఉందంటూ కామెంట్స్ చేసారు వర్మ.