logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రాజమౌళికి కరోనా.. రాంగోపాల్ వర్మ సెటైర్లు!

బాహుబలి తో తెలుగు సినిమా ఖ్యాతిని దేశం నలుమూలలా చాటిన దర్శకుడు రాజమౌళి. తాజాగా రాజమౌళి తన కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించగా కరోనా బయటపడిందని తెలిపారు. కరోనా వైరస్ వచ్చినన్ని ఆ కుటుంబం భయపడలేదు. కోవిడ్ నిబంధనల మేరకు క్వారెంటైన్ కు వెళ్లారు.

అలాగే శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడటం కోసం చూస్తున్నామని.. కరోనా నుంచి కోలుకోగానే ప్లాజ్మా దానం చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి స్ఫూర్తి నింపే విధంగా స్పందించారు. కాగా రాజమౌళి అయన కుటుంబ సభ్యులు ఈ మహమ్మారి నుంచి కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు ఆయనను ఫోన్ ద్వారా పరామర్శించారు.

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ వార్తపై స్పందించాడు. అయితే తన మార్కు ట్వీట్ తో సెటైర్ కూడా వేసాడు. సార్.. మీ సైనికుడు ‘బాహుబలి’ ని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ పక్కన పెడితే.. మీరు, మీ కుటుంబ సభ్యులు అతి త్వరలోనే దీని నుంచి కోలుకుంటారు అని వర్మ ట్వీట్ చేసాడు.

Related News