logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?

తెలంగాణ‌లోని ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా పాలంపేట గ్రామంలో ఉన్న రామ‌ప్ప దేవాల‌యాన్ని వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తించింది. రామ‌ప్ప ఆల‌యంతో పాటు దేశంలో మ‌రికొన్ని ప్రాంతాల‌ను హెరిటేజ్ సైట్లుగా గుర్తించాల‌ని కేంద్రం ఇప్ప‌టికే యునెస్కోకు ప్ర‌తిపాద‌న‌లు పంపించింది. ఈ ప్రతిపాద‌న‌ల‌ను ప‌రిశీలించి, హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు ఇవ్వడానికి కావాల్సిన అన్ని అర్హ‌త‌లు రామ‌ప్ప దేవాల‌యానికి ఉన్నాయ‌ని గుర్తించిన త‌ర్వాత యునెస్కో ఈ నిర్ణ‌యం తీసుకుంది.

యునెస్కో అంటే యునైటెడ్ నేష‌న్స్ ఎడ్యుకేష‌న‌ల్‌, సైంటిఫిక్ ఆండ్ క‌ల్చ‌ర‌ల్ ఆర్గ‌నైజేష‌న్‌. ఐక్య‌రాజ్య స‌మితికి ఇది అనుబంధ సంస్థ‌. 1972లో యునెస్కో వ‌ర‌ల్డ్ హెరిటేజ్ క‌న్వెన్ష‌న్‌ను ఏర్పాటు చేసింది. ప్ర‌పంచంలోని పురాత‌న ప్రాంతాల‌ను హెరిటేజ్ సైట్స్‌గా గుర్తించాల‌నేది దీని ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశ్యం. 1977 న‌వంబ‌ర్ 14న మ‌న దేశం ఈ క‌న్వెన్ష‌న్‌ను అంగీక‌రించింది.

యునెస్కో నియ‌మించే వ‌ర‌ల్డ్ హెరిటేజ్ క‌మిటీ వివిధ దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌తిపాద‌న‌లు ప‌రిశీలించి వ‌రల్డ్ హెరిటేజ్ సైట్స్‌ను గుర్తిస్తుంది. 1983లో మొద‌టిసారి మ‌న భార‌త్‌లోని అజంత గుహ‌లు, ఎల్లోరా గుహ‌లు, ఆగ్రా ఫోర్ట్‌, తాజ్ మ‌హాల్‌కు ఈ జాబితాలో స్థానం ద‌క్కింది. రామ‌ప్ప ఆల‌యంతో క‌లిసి ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశానికి చెందిన‌ మొత్తం 39 ప్రాంతాలు ఈ జాబితాలో చోటు ద‌క్కించుకున్నాయి.

ఇందులో 31 సాంస్కృతిక విభాగంలో, 7 ప్ర‌కృతి విభాగంలో, ఒక‌టి రెండింటిలో క‌లిపి చోటు ద‌క్కించుకున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో మ‌న దేశం నుంచి

1. మ‌హారాష్ట్ర‌లోని అజంత గుహ‌లు
2. ఎల్లోరా గుహ‌లు
3. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా ఫోర్ట్‌
4. తాజ్ మ‌హాల్‌
5. పూరిలోని కోణార్క్ టెంపుల్‌
6. త‌మిళ‌నాడు మ‌హాబ‌లిపురంలోని ఆల‌యాలు
7. అస్సాంలోని క‌జిరంగ నేష‌న‌ల్ పార్కు
8. మాన‌స్ వైల్డ్‌లైఫ్ సాంక్చ‌రీ
9. రాజ‌స్థాన్‌లోని కియోలాడియో నేష‌న‌ల్ పార్కు
10. గోవాలోని చ‌ర్చిలు
11. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఖ‌జుర‌హో క‌ట్ట‌డాలు
12. క‌ర్ణాట‌క‌లోని హంపి
13. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఫ‌తేపుర్ సిక్రి
14. క‌ర్ణాట‌క‌లోని ప‌ట్ట‌ద‌క‌ల్ క‌ట్ట‌డాలు
15. మ‌హారాష్ట్ర‌లోని ఎలిఫెంటా గుహ‌లు
16. త‌మిళ‌నాడులో చోళులు నిర్మించిన ఆల‌యాలు
17. ప‌శ్చిమ బెంగాల్‌లోని స‌న్‌బ‌ర్డ‌న్స్ నేష‌న‌ల్ పార్కు
18. ఉత్త‌రాఖండ్‌లోని నందాదేవి వ్యాలీ
19. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సంచి బౌద్ధ స్థూపాలు
20. ఢిల్లీలోని హుమాయున్ టూంబ్‌
21. కుతుబ్ మినార్‌
22. మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా
23. బిహార్‌లోని బోధ్‌గ‌యా
24. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భింబెక్త‌
25. మ‌హారాష్ట్ర ముంబైలోని సీఎస్టీ రైల్వే స్టేష‌న్‌
26. గుజ‌రాత్‌లోని చంప‌నేర్ ఆర్కియాలాజిక‌ల్ పార్కు
27. ఢిల్లీలోని ఎర్ర‌కోట‌
28. రాజ‌స్థాన్‌లోని జంత‌ర్ మంత‌ర్‌
29. కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌లో విస్త‌రించి ఉన్న ప‌శ్చిమ క‌నుమ‌లు
30. రాజ‌స్థాన్‌లోని కోట‌లు
31. గుజ‌రాత్‌లోని రాణి కి వవ్‌
32. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని గ్రేట్ హిమాచ‌ల్ నేష‌న‌ల్ పార్కు
33. బిహార్‌లోని న‌లంద విశ్వ‌విద్యాల‌యం
34. సిక్కింలోని కంచ‌న్‌జంగా నేష‌న‌ల్ పార్కు
35. చండీగ‌ఢ్‌లోని 17 క‌ట్ట‌డాలు
36. గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ న‌గ‌రం
37. మ‌హారాష్ట్ర‌లోని విక్టోరియ‌న్ బిల్డింగ్స్‌
38. రాజ‌స్థాన్‌లోని జైపూర్ న‌గ‌రం
ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు రామ‌ప్ప ఆల‌యం కూడా చేరింది.

తెలంగాణ నుంచి ఈ జాబితాలో చేరిన మొద‌టి ప్ర‌దేశం రామ‌ప్ప దేవాల‌యం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఏ ప్ర‌దేశం కూడా ఈ జాబితాలో చేర‌లేదు. తెలంగాణ నుంచి కుతుంబ్‌షాహీలు, అస‌ఫ్‌జాహీలు నిర్మించిన ప‌లు క‌ట్ట‌డాల‌ను కూడా వ‌ర‌ల్డ్ హెరిటేజ్ సైట్స్‌గా గుర్తించాల‌ని ప్ర‌తిపాద‌న‌లు ఇప్ప‌టికే యునెస్కో వ‌ద్ద ఉన్నాయి. ఇంకా మ‌న దేశానికి చెందిన అనేక చారిత్ర‌క‌, ప్ర‌కృతిసిద్ధ‌మైన ప్ర‌దేశాల‌ను గుర్తించాల‌ని యునెస్కోకు ప్ర‌తిపాద‌న‌లు పంపించారు.

Related News
%d bloggers like this: