logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

‘కాలేజీ రోజుల్లో మిమ్మల్ని మరో మణిరత్నం అనుకునేవాళ్లం.. మీరేమో ఇలా’

మూడు దశాబ్దాల కిందట సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతో తెలుగు సినిమా రోపు రేకలు మార్చాడు వర్మ. ఆ సినిమా తర్వాత వర్మ దేశంలోనే అత్యుత్తమ దర్శకుడు అయిపోతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ అందరూ అనుకున్నట్టుగా చేస్తే ఆర్జీవీ ఎలా అవుతాడు.

అంతా నాఇష్టం అంటూ తనకు తోచిన సినిమాలు తీసి జనాల మీకు వదిలాడు. అయినా అందులో బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే పేలాయి. కానీ ఆ తర్వాత వర్మ తీసిన సినిమాలు అతని ఇమేజ్ ను భారీగా దెబ్బతీశాయి. గత కొంతకాలంగా ముఖ్యంగా ఈ లాక్ డౌన్ సమయంలో వర్మ సినిమాలు అయన అభిమానులకు కూడా నచ్చటం లేదట. ఇటీవల క్లైమాక్స్, నేకెడ్ వంటి బీ గ్రేడ్ సినిమాలు తీసి మరింత అప్రతిష్టను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ బయో పిక్ పేరుతో మరో సినిమాతో ముందుకొచ్చాడు. కాగా వర్మ చేస్తున్న సినిమాలపైన అయన అభిమాని ఒకరికి కొప్పమొచ్చింది. ఆర్జీవీ సినిమాలు చూసి బాగా హార్ట్ అయ్యాడట. అయన ఎవరో కాదు తెలుగు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ విషయాన్ని అయన స్వయంగా వర్మకే ట్వీట్ ద్వారా చెప్పారు. ‘ఒకప్పుడు నా చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసి మన తెలుగు వాళ్లకూ ఒక మణిరత్నం ఉన్నాడనుకున్నాం.. మీరేమో నా ఇష్టం అని చెప్పి ఏదేదో చేస్తున్నారు.. పొండి సార్ మీతో కటిఫ్ .. మీరేమి నాకు రిప్లై ఇవ్వక్కర్లేదు తెలివిగా ఏదేదో చెప్పేస్తారు.. నేను హార్టు’ అంటూ ట్వీట్ చేసారు.

Related News