logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

‘ఎన్నికల ఫలితాల తర్వాత పవన్’.. వర్మ సంచలన పోస్టర్ విడుదల!

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో లీడ్ రోల్ ను పరిచయం చేసి షాకిచ్చాడు వర్మ. ఈ సినిమాలో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారంటూ గతంలో ఓ ట్వీట్ చేసాడు.

తాజగా ఈ సినిమాకు సంబందించిన ఓ సంచలన పోస్టర్ ను విడుదల చేసాడు. ‘పవర్ స్టార్‌ సినిమాలోని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇదిగో.. ఈ సినిమా త్వరలోనే ఆర్జీవీ వరల్డ్‌ థియేటర్‌లో విడుదల కానుంది. జై పవర్‌ స్టార్’ అంటూ ట్వీట్ చేసాడు కాగా ఈ సినిమా ఏ వ్యక్తినో ఉద్దేశించి తీయడం లేదని కేవలం రాజకీయాల్లో ఓటమి పాలైన ఓ సినీ నటుడికి సంబందించిన ఓ కల్పిత కథ ను ‘పవర్ స్టార్’ సినిమాలో చూపిస్తానని పేర్కొన్నాడు.

తాజగా వర్మ విడుదల చేసిన పోస్టర్ లో హీరో అచ్చం జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ను పోలి ఉన్నాడు. నల్ల దుస్తులు ధరించి దీర్ఘంగా ఆలోచిస్తూన్న పోస్టర్ ను వర్మ విడుదల చేసాడు.

Related News