టాలీవుడ్ హీరోలు స్నేహమంటే ప్రణమిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా మెగా హీరో రామ్ చరణ్ తన ప్రాణ స్నేహితుడిపుట్టిన రోజు జరిపి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ హీరో ఎవరో కాదు. శర్వానంద్. టాలీవుడ్ లో వివాదాలు లేని అతి కొద్ది మందిలో శర్వానంద్ కూడా ఒకడు. మార్చి 6వతేదీన శర్వానంద్ తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.
కాగా ఈ వేడుకలను స్వయంగా రామ్ చరణ్ నిర్వహించడం విశేషం. అందుకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శర్వానంద్ ఈ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ తన కోసం ఈ అరేంజ్ మెంట్స్ చేసిన రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. రామ్ చరణ్ ఇటీవల ‘ఆచార్య’ సినిమా షెడ్యూలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
అక్కడి నుంచి రాగానే మరో స్నేహితుడు విక్రమ్ తో కలిసి శర్వా ఇంటికి చేరుకున్నాడు. అక్కడ శర్వాతో కేక్ కట్ చేయించి బర్త్ డేను సెలబ్రేట్ చేసాడు. కాగా శర్వానంద్ నటిస్తున్న ‘శ్రీకారం’ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తుంది.