logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాబోయే భారీ సినిమాలు ఇవే!

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన ఏ సినిమా విడుదలకాలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో చెర్రీ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతోపాటుగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాలో స్టూడెంట్ లీడర్ గా కనిపించి ఫ్యాన్ కు ఐ ఫీస్ట్ అందించబోతున్నాడు. ఇదిలా ఉంటె ఈ సినిమాల ద్వారా వచ్చిన గ్యాప్ ను పూర్తిగా ఫిల్ చేయాలనుకుంటున్నాడు ఈ మెగా హీరో. అందుకే ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస పెట్టి భారీ ప్రాజెక్టులకు ఒకే చేప్పేసాడు. అయితే ఈ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ తెలిస్తే అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో సిద్దమవుతున్నాడు రామ్ చరణ్. అవన్నీ కూడా టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్లుగా పేరున్న దర్శకులతోనే కావడం విశేషం.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమాల లిస్టు చూస్తే.. ఇప్పటికే సంచలన దర్శకుడు శంకర్ తో ప్యాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో ఒక యాక్షన్ థ్రిల్లర్ ను చేయనున్నాడు. ప్రస్తుతం హిందీ జెర్సీ రేంక్ లో బిజీగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ పూర్తవగానే శంకర్ సినిమాతో పాటుగానే ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. మరోవైపు వంశీ పైడిపల్లి చెప్పిన కథను ఒకే చేసాడు చరణ్. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి. ‘చలో’, ‘భీష్మ’ లాంటి సినిమాలతో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు వెంకీ కుడుముల. ఈ డైరెక్టర్ ఇప్పటికే మహెష్ బాబుతో ఓ భారీ ప్రాజెక్ట్ ఒకే చేయించాడు. అంతే కాకుండా ఇప్పుడు రామ్ చరణ్ కు ఓ మాంచి స్టోరీ చెప్పి ఇంప్రెస్ చేసాడు. ఈ కాంబినేషన్లో త్వరలోనే సినిమా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఓ భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేయనున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ నిర్మిస్తారని టాక్ నెడుతుంది.

ఇదిలా ఉంటె అనిల్ రావిపూడి రామ్ చరణ్ ఇమేజ్ కు తగ్గట్టు ఓ హిల్లేరియస్ కథను రెడీ చేసుకున్నాడట. ఈ సినిమాపై చెర్రీ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారని అన్ని ఒకే అయితే వెంటనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని సమాచారం. ఇక ఖైదీ, మాస్టర్ లాంటి సినిమాలతో దర్శకుడు లోకేష్ కనగరాజన్ పేరు మారుమోగిపోయింది. ఆచార్య, ఆర్అర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఈ దర్శకుడితో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే లోకేష్ మాత్రం కమల్ హాసన్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ చేసాడు. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా ఉండవచ్చనే తెలుస్తుంది. ఈ సినిమాలతో పాటుగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, మనం డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ లతో సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతుంది.

Related News