logo

  BREAKING NEWS

బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |  

ఏపీ సీఎం జగన్ కు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా ఫోన్..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ తో కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. భారత్ – చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

వీడియో కఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. గాల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించడం సహా సరిహద్దుల్లో ఎలాంటి వ్యూహం అమలు చేయాలనే అంశాలపై చర్చించనున్నారు. రేపు జరగబోయే అఖిలపక్ష సమావేశంలో జగన్ కూడా పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా లు సీఎం జగన్ తో ఫోన్లో సంభాషించారు. జగన్ తో పలు కీలక విషయాలపై చర్చినట్టు సమాచారం. ఇప్పటికే ఈ అంశంపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి తమ రాష్ట్రం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News