logo

  BREAKING NEWS

గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |  

రజి‌నీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖ‌రారు… ఏంటో తెలుసా..?

రెండు ద‌శాబ్దాల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌, అభిమానుల ఎదురుచూపుల త‌ర్వాత త‌మిళ సూప‌ర్ స్టార్ రజి‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి అడుగేస్తున్నారు. ఆయ‌న త్వ‌ర‌లోనే పార్టీని స్థాపించ‌బోతున్నారు. ఇందుకు సంబంధించి రజి‌నీకాంత్ స‌న్నిహితులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021లో జ‌ర‌గ‌నున్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల టార్గెట్‌గా రజి‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు.

రజి‌నీకాంత్ రాజ‌కీయ పార్టీ పేరు, గుర్తుపై త‌మిళ‌నాడులో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వీటికి చెక్ పెడుతూ ఆయ‌న పార్టీ పేరు, గుర్తును ఖ‌రారు చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రజి‌నీకాంత్ పార్టీ పేరు మ‌క్క‌ల్ సేవై క‌చ్చి అని పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఎన్నిక‌ల గుర్తుగా ఆటోను ఎంచుకున్న‌ట్లు చెబుతున్నారు. అయితే, ముందు సైకిల్ గుర్తును తీసుకుంటార‌నే ప్ర‌చారం జ‌రిగినా ఆయ‌న ఆటో గుర్తు వైపు మొగ్గు చూపారు.

రజి‌నీకాంత్ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన బాషా సినిమాలో ర‌జ‌నీ ఆటో డ్రైవ‌ర్‌గా క‌నిపించిన విష‌యం తెలిసిందే. చాలా మంది అభిమానులకు ఈ సినిమాలో ర‌జ‌నీ రోల్ బాగా గుర్తుడిపోయింది. ఆటో సాధార‌ణ, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ప్ర‌ధాన ర‌వాణా సాధ‌నం. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌నే ఉద్దేశ్యంతో త‌న పార్టీ గుర్తుగా ఆటోను రజి‌నీకాంత్ ఎంచుకున్న‌ట్లు చెబుతున్నారు.

Related News