logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌

మెగా కుటుంబంతో జీవిత రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు విభేదాలు ఉన్నాయ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఇరు కుటుంబాలు కొన్నిసార్లు ఈ విభేదాల‌ను తొల‌గించుకునేందుకు ప్ర‌య‌త్నించినా, త‌మ మ‌ధ్య గొడ‌వ‌లు లేవ‌ని చెప్పేందుకు ప్రయ‌త్నించినా అప్పుడ‌ప్పుడు బ‌య‌ట‌ప‌డుతూనే ఉంటారు. తాజాగా, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పైన రాజ‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు త‌న‌పై కోప‌మ‌ని రాజ‌శేఖ‌ర్ ఆరోపించారు.

చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు రాజ‌శేఖ‌ర్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో పెద్ద వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి. చిరంజీవి రాజ‌కీయాల‌కు ప‌నికిరాడ‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేశ‌ప‌రుడ‌ని, వీరు రాజ‌కీయాల్లో స‌క్సెస్ కాలేర‌ని రాజ‌శేఖ‌ర్ అప్ప‌ట్లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. రాజ‌శేఖ‌ర్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హంతో ఆయ‌న కుటుంబంపైన మెగా అభిమానులు దాడి చేశారు. దీంతో చిరంజీవి స్వ‌యంగా రాజ‌శేఖ‌ర్ ఇంటికి వెళ్లి త‌న అభిమానుల త‌ర‌పున తాను క్ష‌మాప‌ణ చెప్పి పెద్ద మ‌న‌స్సు చాటుకున్నారు.

అంత‌టితో ఈ వివాదం చ‌ల్లారింది. కానీ, ఇరు కుటుంబాల మ‌ధ్య విభేదాలు మాత్రం కొన‌సాగుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా రాజ‌శేఖ‌ర్ న‌టించిన శేఖ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఆయ‌న ఒక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మిమ్మ‌ల్ని ఇమిటేట్ చేసిన‌ట్లు అనిపించింది క‌దా అని యాంక‌ర్ ఒక ప్ర‌శ్న వేశారు.

దీనిపైన రాజ‌శేఖ‌ర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు త‌న‌పై ఉన్న కోపాన్ని ఆ విధంగా తీర్చుకున్నార‌ని రాజ‌శేఖ‌ర్ చెప్పారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇలా సెటైరిక‌ల్‌గా త‌న‌ను ఉద్దేశించి డైలాగ్స్ చెప్ప‌డం అప్పుడు చాలా బాధ క‌లిగించింద‌న్నారు. ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన‌ప్పుడు నేను చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌పై కోపంగా ఉన్నార‌ని రాజ‌శేఖ‌ర్ చెప్పారు. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాలో త‌న‌ను ఇమిటేట్ చేసి పేర‌డీగా మార్చి త‌న‌పై కోపాన్ని తీర్చుకున్న‌ట్లు చెప్పారు.

Related News
%d bloggers like this: