సినీ నటులు జీవితా రాజశేఖర్ దంపతులకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాజశేఖర్ హీరోగా నటించిన శేఖర్ సినిమా ఈ నెల 20వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజులకే ఈ సినిమాను ఆపేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో జీవితా రాజశేఖర్‌కు పెద్ద షాక్ తగిలింది. తమకు ఇవ్వాల్సిన డబ్బులను జీవితా రాజశేఖర్ చెల్లించలేదని ఫైనాన్షియర్ పరంధామ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇవాళ సాయంత్రం లోపు రూ.65 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ డబ్బు చెల్లించకపోతే సినిమా ప్రసారాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలపై రాజశేఖర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు కుట్ర చేసి తమ సినిమాను ఆపించారని ఆరోపించారు. ఈ సినిమాను పూర్తి చేసేందుకు చాలా కష్టపడ్డామని, సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు.