logo

  BREAKING NEWS

‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |  

రాజకీయపార్టీపై రజని బిగ్ ట్విస్ట్.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన సూపర్ స్టార్!

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు చేదువార్త వినిపించారు. ఇటీవల రజని తన రాజకీయ పార్టీపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31 వ తేదీ అయన పార్టీని ప్రకటిస్తానని అన్నారు. దీంతో తలైవా అభిమానులు పండగ వాతారవరం సృష్టించారు. అయన పార్టీ గుర్తుపై కూడా అనేక వార్తలు వెలువడ్డాయి. ఇక త్వరలోనే పార్టీ పెట్టి వచ్చే ఎన్నికలో ప్రభంజనం సృష్టిస్తారని అంతా భావించారు.

అయితే ఊహించని విధంగా రజని కాంత్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ కారణంగా హైదరాబాద్ వచ్చిన రజని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన మరోసారి కీలక ప్రకటన చేసారు. ఆయన రాజకీయాలపై వెనక్కి తగ్గారు. తన ఆరోగ్యం సహకరించకపోవడం వలన ఇప్పట్లో పార్టీ ఆలోచన నుంచి విరమించుకుంటున్నానన్నారు.

రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని ఆయన అన్నారు. ఈ మేరకు మూడు పేజీల ప్రకటనను ను విడుదల చేసారు. అభిమానులు తనను క్షమించాలని ఆయన కోరారు. రజని ఆరోగ్యం పై ఆయన కుటుంబ సంభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయన కుమార్తెలు కూడా రాజకీయ ప్రవేశంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. దీంతో రజని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంచారం.

 

Related News