సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు ఆయన రాజకీయ రంగప్రవేశం పై క్లారిటీ ఇచ్చారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. తన పార్టీకి సంబందించిన వివరాలను డిసెంబర్ 31వ తేదీన వెల్లడిస్తానని తెలిపారు.
గత నెల్ 30 వ తేదీన రజనీ అభిమాన సంఘాలతో భేటీ అయిన విషయం తెలిసిందే . ఈ సమావేశంలో భాగంగా రజనీని రాజకీయాల్లోకి రావాలని, తమిళనాడు సీఎం అభ్యర్థిగా ఉండాలంటూ ఆయన అభిమానులు కోరారు. మీరు పార్టీ పెడితే మీతో కలిసి నడుస్తాం, బీజేపీతో కలిస్తే తమ మద్దతు ఉండబోదని చెప్పి అభిమానులు రజనీకి షాకిచ్చారు.
దీంతో తన రాజకీయ ప్రవేశంపై త్వరలోనే ప్రకటిస్తానని చెప్పిన రజనీ తన అభిమాన సంఘాల నాయకులతో తాను మాట్లాడాను, వారి అభిప్రాయాలు సేకరించాను. కాగా తాజాగా తాను పార్టీ పెట్టబోతున్నానని తేల్చి చెప్పారు. దీంతో తలైవా అభిమానుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది.