logo

  BREAKING NEWS

ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |  

అభిమాన సంఘాలకు షాకిచ్చిన సూపర్ స్టార్..!

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఒకసారి.. రారని ఒకసారి ఎన్నో రకాలుగా ప్రచార జరుగుతుంటుంది. ఆయన అభిమానులు మాత్రం రజనీని రాజకీయాల్లోకి రావాలని పట్టుబడుతున్నారు. 2017 లో మొదటిసారిగా రజనీ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటన చేసారు. కానీ ఇప్పటివరకు రజనీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగలేదు.

ఈ నేపథ్యంలో రజనీ అభిమాన సంఘాలతో సమావేశమవ్వడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో భాగంగా రజనీ రాజకీయ ప్రకటన చేస్తారని తమిళనాట అంతా భావించారు. కాగా ఈసారి కూడా ఆయన తన అభిమానులకు నిరాశే మిగిల్చారు. రజనీ తన పొలిటికల్ పార్టీపై ఎలాంటి ప్రకటనా చేయకుండానే వెనుదిరిగారు.

దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇంకా ఆలస్యం చేస్తే ఇచ్చిన మాట తప్పినవారవుతారని ఆందోళన వ్యక్తం చేసారు. రజనీ వాహనాన్ని నినాదాలతో చుట్టుముట్టారు. పార్టీ పెట్టి తమిళనాడుకు ముఖ్యమంత్రిగా మారాలంటూ ఆయన అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. రజనీ మాత్రం ఈ విషయంపై స్పందించకుండా మౌనంగా వెళ్లిపోయారు.

Related News