logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

సినీనటుడు రాజనీకాంత్ కు తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్ అపోలోకు తరలింపు!

సినీ నటుడు రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఆయనను హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రజని హైబీపీతో బాధ పడుతున్నారని ఆయనకు చికిత్స అందిస్తున్నామని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది.

కాగా రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ కోసం రజనీ ఇటీవలే హైదరాబాద్ కు వచ్చారు. కాగా ఈ సినిమా యూనిట్ లో ఏకంగా 20 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో షూటింగ్ ను నిలిపివేశారు. రజనితో సహా షూటింగ్ లో పాల్గొన్నవారంతా హోమ్ క్వారెంటైన్ ల ఉంటున్నారు. మరోవైపు రజనీకాంత్ కు కూడా కరోనా సోకిందని అందుకే ఆసుపత్రిలో చేరారని ప్రచారం జరుగుతుంది.

అందుకు అపోలో ఆసుపత్రి యామాన్యం స్పందిస్తూ ప్రస్తుతం ఆయనలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ఈ నెల 22న రజనికి కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చినట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఆయనకు హై బ్లడ్ ప్రెజర్ తప్ప మరే అనారోగ్య సమస్యలు, కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు.

Related News