logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

రజనీకాంత్ ను జపానీయులు ఎందుకు అంత ఆరాధిస్తారు?

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. విదేశాల్లో రజనికి ఉన్న ఆదరణ మరే నటుడికి ఉండదేమో. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది జపాన్ దేశస్తుల గురించి. సింగపూర్, మలేసియా దేశాలలో అధికంగా తమిళులు ఉంటారన్న విషయం తెలిసిందే.. కానీ తమిళ జనాలకు ఏమాత్రం సంబంధం లేని జపాన్ లో కూడా రజని పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అక్కడి వారు మన భారతీయులతో సమానంగా రజనీని ఆరాధిస్తారు.

జపాన్ యూత్ కూడా రజని స్టైల్ ను అనుకరిస్తుంటారు. రజని స్టైల్, మేనరిజమ్స్ ను విపరీతంగా ఇష్టపడతారు. భారత్ లో విడుదలయ్యే సినిమాలన్నీ జపాన్ లో కూడా విడుదల చేస్తారు. జపాన్ లో రజని ఫ్యాన్ క్లబ్బుల్లో వేలాది మంది సభ్యులు మెంబర్లుగా ఉన్నారు. అసలు రజనీకాంత్ జపనీయులకు ఆరాధ్య నటుడిగా ఎలా మారారు. రజని గురించి వాళ్లకు ఎలా తెలుసు అనే విషయాలు వెనక ఆసక్తికర కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం…

జపనీయులు రజినీపై ఇంతలా అభిమానం చూపడానికి కారణం ఒకే ఒక్క సినిమా. ముత్తు సినిమా దక్షిణాదిలో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా చూసి జపాన్ యువకులు కూడా చొక్కాలు చింపుకునేంత రేంజ్ లో ఇష్టపడ్డారు. ఈ సినిమాతోనే జపాన్ లో కూడా తమిళ సంస్కృతిపై మక్కువ పెరిగింది. ఇదంతా జరగటానికి కారణం జపాన్ కు చెందిన జూన్ ఎడికో అనే సినీ విమర్శకుడు. ఆయన ఒకసారి సింగపూర్ కి వెళ్ళాడు. అక్కడ మినీ ఇండియా గా పిలిచే ఒక మార్కెట్లోని సీడీ షాపులోకి వెళ్లి ఏదైనా ఇండియన్ సినిమా ఉందా అని అడిగాడు. అప్పుడా షాపు యజమాని రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా సీడీని అతనికి ఇచ్చాడు.

ఆ సినిమా ఎడికోకి తెగ నచ్చేసింది. ఆ సినిమాను ఎడికో తన స్నేహితులకు, భార్యకు చూపించాడు. అలా వారి ద్వారా మరికొంత మంది ఈ సినిమాను చూసారు. ఇలా ఆ నోటా ఈ నోటా ముత్తు సినిమా గురించి జనడియాక్స్ అనే మల్టిప్లెక్స్ సంస్థల దృష్టికి వెళ్ళింది. వెంటనే వారు ముత్తు సినిమా హక్కులను తీసుకుని జపాన్ భాషలోకి అనువదించి విడుదల చేశారు. ఇంకేముంది. ముత్తు సినిమాలో రజని స్టైల్ కు అక్కడి వారు ఫిదా అయిపోయారు.

అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఈ సినిమా దుమ్మురేపింది. ఎక్కడ చూసినా రజనీకాంత్, మీనా పోస్టర్లు వెలిశాయి. అలా జపాన్ లో రజనికి ఈ సినిమా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ తర్వాత ఎంత మంది నటులు వచ్చినా జపాన్ లో రజనికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆనాటి నుంచి ఇండియాలో విడుదలయ్యే సినిమాలన్నీ ఇక్కడితో సమానంగా జపాన్ లో కూడా విడుదల చేయడం ఆనవాయితీగా మారింది.

Related News