logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

గ్యాంగ్ రేప్ కు గురైన బాలికకు కరోనా పాజిటివ్!

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి గురైన బాధితురాలికి కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్దారించారు. కాగా ఈ ఘటనలో నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులలో ఇద్దరికీ కూడా కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు బాధితురాలికి కూడా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఈ విషయం తేలింది. ప్రస్తుతం బాధిత బాలికకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే బాలికను రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో పాటు మరికొందరు దళిత సంఘం నేతలు కూడా పరామర్శించారు.

రాజమహేంద్రవరంలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న బాలికను ఆమెకు వరసకు సోదరి అయ్యే అనిత జూన్ 22న ఆమెను వెంటబెట్టుకుని ఎయిర్‌పోర్టు రోడ్డుకు వెళ్లింది. అక్కడ ఐదుగురు యువకులు బాలికను ఆటోలో ఎక్కించుకుని రంపచోడవరం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని అనిత సహా నిందితులు బెదిరించడంతో బాలికను ఇంటి దగ్గర వదిలిపెట్టారు.

ఈ విషయం తెలిసిన మరి కొంత మంది యువకులు కూడా బాలిక సోదరి సహాయంతో మరి కొంత మంది యువకులు ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తీవ్ర అనారోగ్యం పాలవడంతో ఆమెను రాజమహేంద్రవరం క్వారీ ప్రాంతంలోని ఓ పెంకుటింట్లో బంధించి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. బాలిక తల్లి కూతురు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ విషయం తెలుసుకున్న నిందితులు బాలికను ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా వారి ద్వారా బాలికకు కూడా కరోనా వచ్చినట్టుగా గుర్తించారు.

Related News