logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..!

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను అక్కడి ప్రజలే భారత్ లో విలీనం చేయాలని కోరుతారని, ఆ రోజు తొందర్లోనే రానుందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘జమ్మూ కశ్మీర్ జన సంవాద్ ర్యాలీ’ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ తో పాటుగా బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. కొన్ని రోజులు ఓపిక పట్టండి.. తమకు పాకిస్తాన్ పాలన వద్దని, పీవోకేను భారత్ లో కలపాలని ఇక్కడి ప్రజలే డిమాండ్ చేస్తారు. ఆ రోజు మన పార్లిమెంట్ లక్ష్యం కూడా నెరవేరినట్టే అన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడబోమన్నారు. ఒకప్పుడు పాకిస్థాన్, ఐఎస్ ఐఎస్ జండాలతో రెపరెపలాడిన పీవోకే లో ఇప్పుడు భారతీయ జెండా ఎగురుతుందన్నారు.

మోడీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు అద్భుతమైన వృద్ధిని సాధిస్తారన్నారు. చైనా సరిహద్దు అంశంపై కూడా రాజ్ నాథ్ సింగ్ పరోక్షంగా స్పందించారు. సరిహద్దుల వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామన్నారు. ఏ దేశంతో ఉన్న వివాదాలను కూడా దాచే ప్రయత్నం చేయడం లేదని తగిన సమయానికి అన్ని పార్లిమెంట్ ముందు ఉంచుతామన్నారు. ఏ దేశాన్ని భయపెట్టే దురుద్దేశం భారత్ కు లేదన్నారు.

Related News