రైల్వేలో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నైరుతి రైల్వే విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 1004 ఖాళీలను భర్తీ చేయడానికి రైల్వే శాఖా నిర్ణయించింది. అందుకు సంబందించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జనవరి 9 లోగా హుబ్లీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) వెబ్సైట్ https://www.rrchubli.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ తెలిపిన వివరాల ప్రకారం హుబ్లీ, బెంగళూరు, మైసూరు డివిజన్లోని వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
విభాగాల వారీ ఖాళీలు:
ఫిట్టర్- 335
ఫిట్టర్ (క్యారేజ్ అండ్ వేగన్)- 117
ఫిట్టర్ (డీజిల్ లోకో షెడ్)- 37
ఎలక్ట్రీషియన్ (డీజిల్ లోకో షెడ్)- 17
వెల్డర్- 55
మెషినిస్ట్- 13
టర్నర్- 13
ఎలక్ట్రీషియన్- 231
కార్పెంటర్- 11
పెయింటర్- 18
రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్ మెకానిక్- 16
ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (PASAA)- 138
స్టెనోగ్రాఫర్- 2
మొత్తం పోస్టుల సంఖ్యా 1004 కాగా అందులో హుబ్లీ డివిజన్ లో 287, హుబ్లీలోని క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్ లో 217, బెంగుళూరు డివిజన్ లో 280, మైసూరు డివిజన్ లో 177, మైసూరులోని సెంట్రల్ వర్క్ షాప్ లో 43 పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
అర్హత:
10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులు కావాలి.
వయసు:
15 నుంచి 24 ఏళ్ల మధ్య అభ్యర్థులు అర్హులు.
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష లేదు. మెరిట్ లిస్ట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 100
ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 9 లోగా RRC వెబ్ సైట్ (https://www.rrchubli.in/ ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏపీలోని అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.