logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌

ఇంత‌కాలం యాదాద్రికి ప్ర‌త్యేక రైల్వే స్టేష‌న్ లేదు. కానీ, యాదాద్రికి ఆరు కిలోమీట‌ర్ల దూరంలో సికింద్రాబాద్ – కాజీపేట రైల్వే లైన్ మ‌ధ్య‌లో రాయ‌గిరి అనే రైల్వే స్టేష‌న్ ఉంది. యాదాద్రికి ఎవ‌రైనా రైలు మార్గం ద్వారా వెళ్లాలంటే ఈ రాయ‌గిరి రైల్వే స్టేష‌న్‌లోనే దిగాల్సి ఉంటుంది. యాదాద్రిని మ‌రింత అభివృద్ధి చేసి దేశంలోనే ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాల్లో ఒక‌టిగా చేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌నులు జ‌రుపుతోంది.

ఇప్ప‌టికే నూత‌న ఆల‌య నిర్మాణ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. ఈ నేప‌థ్యంలో రాయ‌గిరి రైల్వేస్టేష‌న్‌కు యాదాద్రి రైల్వే స్టేష‌న్‌గా నామ‌క‌ర‌ణం చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్ర రైల్వే శాఖ‌ను కోరింది. ఈ విన‌తి మేర‌కు రాయ‌గిరి స్టేష‌న్ పేరును యాదాద్రిగా మారుస్తూ కేంద్ర రైల్వే శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వులు త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి రావ‌డంతో రాయ‌గిరి ఇక యాదాద్రి రైల్వే స్టేష‌న్‌గా మార‌నుంది.

హైద‌రాబాద్ నుంచి యాదాద్రికి ఎక్కువ‌గా భ‌క్తులు వెళుతుంటారు. యాదాద్రి చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల ప్ర‌జ‌లు హైద‌రాబాద్‌కు ప్ర‌తి రోజూ వివిధ ప‌నులు చేసుకోవ‌డానికి వ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలో రాయ‌గిరి వ‌ర‌కు ఎంఎంటీఎస్ రైలును ఏర్పాటుచేయాల‌ని చాలా రోజులుగా ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి. ఇప్పుడు రాయ‌గిరి పేరు యాదాద్రిగా మార‌డంతో ఈ ప్ర‌తిపాద‌న‌లు కూడా త్వ‌ర‌లోనే కార్య‌రూపం దాల్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Related News