logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బిగ్ బాస్ విన్నర్ ను నిండాముంచిన బేబీ.. ‘హార్ట్ బ్రేక్’ పోస్ట్ అందుకే..

సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ గా గెలిచి షాకిచ్చాడు. ఈ షో ద్వారా రాహుల్ పునర్నవిల జోడీ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇటీవల పునర్నవి ఎంగేజ్ మెంట్ రింగ్ తో ఓ ఫోటో పోస్ట్ చేయడం అదే సమయంలో రాహుల్ సిప్లిగంజ్ హార్ట్ బ్రేక్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో వీరిద్దరి వ్యవహారం మరో సారి హాట్ టాపిక్ అయ్యింది.

ఆ తర్వాత తన సినిమా ప్రమోషన్లో భాగంగానే రింగ్ పోస్ట్ పెట్టానని పునర్నవి క్లారిటీ ఇవ్వగా.. తాజాగా రాహుల్ కూడా తన పోస్ట్ పై స్పందించాడు. సింగర్ గా ఓ వైపు బిజీగా ఉంటూనే రాహుల్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తాడన్న విషయం తెలిసిందే. వాటితోనే అతనికి బాగా గుర్తింపు వచ్చింది. అయితే ఇటీవల ‘ఓ బేబీ’ అనే ఆల్బమ్ కోసం ఏకంగా రూ. 58 లక్షలు ఖర్చు చేసాడట రాహుల్.

అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేయించి.. కొరియోగ్రాఫర్, మోడల్స్ తో మొత్తం మూడు రోజులపాటు ఈ సాంగ్ షూట్ చేశారట. అయితే తాను ఊహించిన బడ్జెట్ కాకుండా మొత్తం 58 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందట. అందులో నిర్మాతలు పెట్టుకున్నది కాకుండా తన దగ్గర నుంచి 28 లక్షలు ఖర్చు పెట్టాడట.

అంత చేసినా ఈ ఆల్బమ్ పై అనుమానంగానే ఉందని ఆవేదన చెందాడట. ఆ బాధలోనే హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టాను అప్పుడే పునర్నవి కూడా రింగ్ తో ఫోటో పెట్టింది. మా ఇద్దరి గురించి సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వచ్చాయి. కొంత మంది పునర్నవి నాకు హ్యాండ్ ఇచ్చిందని ప్రచారం చేసారు. అలా కాదురా అని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రెండు పోస్టులు వారు అనుకునే అర్థం వచ్చేలాగే ఉన్నాయి అన్నాడు నిజానికి తమ మధ్య అలాంటిదేమీ జరగలేదని క్లారిటీ ఇచ్చాడు రాహుల్.

Related News