భారత్ – చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 20 మంది భారత సైనికులు మరణంపై రాహుల్ దిగ్బ్రాంతి వ్యక్త చేసారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.
మన సైనికులను చంపడానికి వారికెంత ధైర్యం?.. వారు మన భూమిని ఆక్రమించుకోవడానికి ఇంత దుస్సాహానికి ఒడిగడతారా? ఇప్పటివరకు జరిగింది చాలు.. అక్కడ పరిస్థితులను ఇప్పటికైనా వివరించండి. అక్కడ ఎం జరుగుతుందో వాస్తవాలని తెలియజేయాలని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసారు. భారత భూభాగంలోకి చైనా దళాలు గత నెల రోజులుగా చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదన్నారు.
చైనాతో పోరులో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందడంపై ప్రజలు తీవ్ర ఆందోళన అవ్యక్తం చేస్తున్నారు. అయితే మొదట ఈ ఘర్షణల్లో ముగ్గురు జవాన్లు మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పుడు 20 మంది జవాన్లు మృతి చెందగా పదుల సంఖ్యలో జవాన్లు తీవ్ర గాయాలపాలయ్యారని తెలుస్తుంది. మరణించిన వారిలో 10 మంది జవాన్ల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని, గాయపడిన వారిలో 4 జవాన్ల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఏం జరుగుతోందనే విషయం పై ప్రజల్లో సందిగ్దత నెలకొంది.