logo

  BREAKING NEWS

షాద్ నగర్ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య పై రాహుల్ కీలక వ్యాఖ్యలు!

ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో బిఎస్సీ సెకండియర్ చదువుతున్న ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మోడీ ప్రభుత్వం కారణంగానే ఐశ్వర్య లాంటి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతోనే కుటంబాలు కుదేలయ్యాయి.

మోదీ ఉద్దేశ్యపూర్వకంగా చేసిన నోట్ల రద్దు, లాక్ డౌన్ కారణంగా ఐశ్వర్య లాంటి అనేక మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఆమె మృతికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు. కాగా ఐశ్వర్య మృతికి నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు ఆందోనలు చేపట్టారు.

షాద్ నగర్ శ్రీనివాస కాలానికి చెందిన ఐశ్వర్య ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆమె తల్లి సుమతి మీడియా ముందు వెల్లడించారు. ఐశ్వర్య బిఎస్సి చదువుతూ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటుందని అయితే లాక్ డౌన్ కారణంగా ఇంటికి వచ్చినట్టుగా తెలిపారు. సెప్టెంబర్ లో హాస్టల్ కాళీ చేయాలనీ తమకు సమాచారం ఇచ్చారని కనీసం కాలేజీకి వెళ్లేందుకు కూడా తమ దగ్గర డబ్బులు లేవని అన్నారు.

అప్పటికే లాక్ డౌన్ కారణంగా తాము అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామన్నారు. అప్పుల వారు ఇంటి మీదకు రావడంతో తన చదువు మాకు భారం కాకూడదన్న కారణంతో ఐశ్వర్య ఈ నెల 3వ తేదీన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. అయితే ఈ కేసులో కాలేజీ యాజమాన్యానికి లాంటి సంబంధం లేదన్నారు.

ఈ ఘటనపై ఆదివారం తల్లిదండ్రల నుంచి పోలీసులకు సమాచారం అందడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ప్రభుత్వం ఇప్పటికైనా తమకు సహాయం చేస్తే తమ రెండో కుమార్తెనైనా చదివించుకుంటామని ఐశ్వర్య తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related News