logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

దర్శకుడు రాఘవేందర్ రావు మాజీ కోడలికి రెండో పెళ్లి!

దర్శకధీరుడు రాఘవేందర్ రావు మాజీ కోడలు రెండో పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి గతంలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ మధ్య అనుష్కతో చేసిన ‘జీరో సైజ్’ సినిమా సమయంలో బాలీవుడ్ రైటర్ కనికా థిల్లాన్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

ఆమె జీరో సైజు సినిమాకు కథా సహకారం అందించారు. వీరిద్దరూ 2014 లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ కొన్ని రోజులకే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయి దూరంగా ఉంటున్నారు. వీరిద్దరికి విడాకులు కూడా జరిగిపోయాయి. ఇదంతా రహస్యంగానే జరిగిపోవడంతో బయటకు తెలియలేదు. గతేడాది ఈ విషయం బయటకు వచ్చింది. ప్రకాష్ తో విడిపోయిన తర్వాత నుచి ఒంటరి గానే ఉంటున్న కనికా ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

ఈ విషయాన్నీ ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ‘కొత్త సంవత్సరంలో కొత్త జీవితంలోకి.. ‘ అంటూ క్యాప్షన్ ఇచ్చి తన సంతోషాన్ని పంచుకున్నారు. బాలీవుడ్ రచయిత హిమాన్షు శర్మను ఆమె వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి నిరాడంబరంగా జరిగింది.

 

Related News