logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

భార‌తగ‌డ్డ‌పైకి ర‌ఫేల్ యుద్ధవిమానాలు.. ర‌ఫేల్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే..!

ఒక‌వైపు దాయాది పాకిస్తాన్ భార‌త్‌ను ఎలా దొంగ‌దెబ్బ తీయాల‌ని స‌రిహ‌ద్దుల వ‌ద్ద కాచుకొని కూర్చుంది. మ‌రోవైపు చైనా ఇటీవ‌ల త‌ర‌చూ భార‌త్‌పై క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ రెచ్చ‌గొడుతోంది. ఇలా రెండు వైపులా రెండు దేశాలు భార‌త్‌తో త‌ల‌ప‌డ‌టానికి కుట్ర‌లు ప‌న్నుతున్నాయి. ఇటుంటి కీల‌క స‌మ‌యంలో భార‌త గ‌డ్డ‌పైకి ఐదు ర‌ఫేల్ యుద్ధ విమానాలు అడుగుపెట్టాయి. ఫ్రాన్స్ నుంచి భార‌త్ ఈ యుద్ధ విమానాల‌ను కొనుగోలు చేసింది. మొద‌టి విడ‌త‌గా ఐదు విమానాల‌ను భార‌త్‌కు ఫ్రాన్స్ పంపించింది. ఇవి మామూలు యుద్ధ విమానాలు కావు. వీటి పేరే శ‌త్రువుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తాయి. ర‌ఫేల్ శ‌బ్ధం దాయాదుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. అస‌లు ర‌ఫేల్ యుద్ధ విమానాల ప్ర‌త్యేక‌త‌లు ఏంటి ? వాటి ధ‌ర ఎంత ? అవి భార‌త్‌కు ఎలా ఉప‌యోగ‌ప‌డతాయి ? అనే విష‌యాలు ఓసారి తెలుసుకుందాం.

భార‌త వాయిసేన అమ్ముల‌పొదిలో చేరిన అద్భుత అస్త్రం ర‌ఫేల్‌. ఇప్ప‌టికే ప్ర‌పంచంలో బ‌ల‌మైన వాయుసేనగా ఉన్న భార‌త్‌కు ర‌ఫేల్ యుద్ధ విమానాలు అద‌న‌పు బ‌లంగా నిల‌వ‌బోతున్నాయి. ప్ర‌పంచంలో ఇప్పుడు ఉన్న యుద్ధ విమానాల్లోర‌ఫేల్ అత్యాధినిక‌మైన‌దిగా ర‌క్ష‌ణ నిపుణులు చెబుతారు. భార‌త వాయుసేన‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు గానూ ఫ్రాన్స్ త‌యారుచేసిన ర‌ఫేల్‌ను కొనుగోలు చేయాల‌ని యూపీఏ-2 ప్ర‌భుత్వం భావించింది.

ఇందుకు గానూ 2012 జ‌న‌వ‌రి 31వ తేదీన ఫ్రాన్స్‌కు చెందిన డ‌సో ఏవియేష‌న్ సంస్థ‌తో ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చింది. దీని ప్ర‌కారం 18 ర‌ఫేల్ యుద్ధ విమానాల‌ను డ‌సో త‌యారుచేసి భార‌త్‌కు ఇవ్వాలి. మ‌రో 108 విమానాల‌ను భార‌త్‌కు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌(హెచ్ఏఎల్‌)లో త‌యారు చేయాలి. ఇందుకు డ‌సో పూర్తిగా స‌హ‌క‌రించాల‌నేది అవ‌గాహ‌న‌. అయితే, త‌ర్వాత వ‌చ్చిన ఎన్డీఏ ప్ర‌భుత్వం ఈ ఒప్పందంలో కొన్ని మార్పులు చేసింది. 2016 సెప్టెంబ‌ర్‌లో భార‌త్ – ఫ్రాన్స్ ర‌ఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని చేసుకున్నాయి.

ఈ ఒప్పందం ప్ర‌కారం 681.7 కోట్ల‌కు ఒక‌టి చొప్పున 28 సింగిల్ సీట్ ర‌ఫేల్ విమానాలు, 703.4 కోట్ల‌కు ఒక‌టి చొప్పున 8 డ్యుయెల్ సీట్ విమానాల‌ను ఫ్రాన్స్ భార‌త్‌కు అందిస్తుంది. ఇవే కాకుండా ప‌లు అధునాత‌న ఆయుధాల‌ను కూడా స‌ర‌ఫ‌రా చేసేలా ఈ ఒప్పందం జ‌రిగింది. కానీ, భార‌త్‌లో ఈ ఒప్పందంపైన ప‌లు పార్టీలు ఆరోప‌ణ‌లు చేశాయి. అవినీతి జ‌రిగింద‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ విష‌యం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. అయితే ర‌క్ష‌ణ వ్య‌వ‌హారాలు, ఒప్పందాలు ర‌హ‌స్యంగా ఉండాల‌ని కోర్టు తీర్పు ఇవ్వ‌డంతో ఒప్పందానికి క్లియ‌రెన్స్ ల‌భించిన‌ట్ల‌య్యింది.

గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌రు 8వ తేదీన ఇండియ‌న్ ఏవియేష‌న్ డే రోజు ఫ్రాన్స్ మొద‌టి విమానాన్ని భార‌త్‌కు అందించింది. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్వ‌యంగా ఫ్రాన్స్‌కు వెళ్లి ఈ విమానాన్ని అందుకున్నారంటే భార‌త్‌కు ర‌ఫేల్ ఎంత కీల‌క‌మో అర్థం చేసుకోవ‌చ్చు. త్వ‌ర‌లో మిగతా విమానాలు కూడా భార‌త్‌కు పంపించ‌నుంది.

ర‌ఫేల్ యుద్ధ విమానాల ప్ర‌త్యేక‌త‌ల‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే.. రెండు ఇంజ‌న్లు ఉండటం దీని ప్ర‌త్యేక‌త. ఒక ఇంజ‌న్ ప‌ని చేయ‌క‌పోతే వెంట‌నే ఇంకో ఇంజ‌న్ ఆన్ అయి విమానాన్ని న‌డిపిస్తుంది. యుద్ధ‌రంగంలో ఉన్న‌ప్పుడు ఆకాశంలోనే ఆయిల్ నింపుకునే అవ‌కాశమూ ర‌ఫేల్‌కు ఉంది. ప్ర‌త్య‌ర్థుల‌పై దాడులు చేయ‌డ‌మే కాదు, ప్ర‌త్య‌ర్థి విమానాల దాడుల నుంచి త‌ప్పించుకునేలా, ఎదుర్కునేలా ర‌ఫేల్‌ను రూపొందించారు.

గంట‌కు 2020 కిలోమ‌ట‌ర్ల వాయువేగంతో ర‌ఫేల్ ప్ర‌త్య‌ర్థుల‌పైకి దూసుకెళుతుంది. భార‌త్‌కు హిమాల‌యాల్లో ఎత్తైన ప్ర‌దేశాల్లో యుద్ధం చేయాల్సిన అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది. ర‌ఫేల్ ఇందుకు చాలా అనువైన‌వి. ప్ర‌పంచంలో ఎత్తైన ప్రాంతంలో యుద్ధం చేయ‌గ‌ల స‌త్తా ర‌ఫేల్ యుద్ధ‌విమానాల‌కు ఉంది. ర‌ఫేల్ ఫ్ల‌యింగ్ రేంజ్ ఇత‌ర యుద్ధ విమానాల కంటే చాలా ఎక్కువ అని ర‌క్ష‌ణ‌రంగ నిపుణులు చెబుతుంటారు.

ర‌ఫేల్ యుద్ధ విమానం గురి త‌ప్ప‌ని బాణం లాంటిది. క్షిప‌ణిని 300 కిలోమీట‌ర్ల దూరం నుంచే ఫైర్ చేసే అవ‌కాశం ఉంటుంది. టార్గెట్‌ను క‌చ్చితంగా ఇది చేదిస్తుంది. ర‌ఫేల్‌తో ల్యాండింగ్ స‌మ‌స్య‌లు అస్స‌లు ఉండ‌వు. చిన్న స్థ‌లంలో అయినా, ప‌ర్వ‌తాల్లో అయినా ర‌ఫేల్ సులువుగా ల్యాండ్ అవ‌గ‌ల‌దు. ఈ విమానానికి నాలుగు వైపులా నిఘా పెట్టే సామ‌ర్థ్యం ఉంది. ఫ్రాన్స్‌తో పాటు ఖ‌తార్‌, ఈజిప్ట్ దేశాలు కూడా ర‌ఫేల్ యుద్ధ విమానాల‌ను వినియోగిస్తున్నాయి. అఫ్గానిస్తాన్‌, లిబియా, ఇరాక్‌, సిరియాలో జ‌రిగిన యుద్ధాల్లో ఈ విమానాల‌ను ఉప‌యోగించారు.

Related News