ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత ఆటగాళ్ళకు మరోసారి అవమానాలు ఎదురయ్యాయి. ఇటీవల సిడ్నీ లో జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యవహారం పై రచ్చ ఇంకా అచలరాక ముందే మరోసారి భారత్ క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. ఈసారి ఆస్ట్రేలియా అభిమానులు రెచ్చిపోయి మరీ మన ఆటగాళ్లపై కామెంట్లు చేసారు.
నాలుగవ టెస్ట్ జరుగుతున్న బ్రిస్బేన్లో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ పై ఆస్ట్రేలియా అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసారు. మహ్మద్ సిరాజ్ ను మురికి వ్యక్తి అంటూ జాతి వివక్షతకు తెరలేపారు. ఈ విషయాన్నీ ఆస్ట్రేలియా వార్తా సంస్థ సిడ్నీ హెరాల్డ్ వెల్లడించింది. మరో ఆటగాడు సుందర్ కూడా ఇలాంటి వివక్షకు గురయ్యాడని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలపై అటు ఆస్ట్రేలియా బోర్డ్, ఐసీసీ బోర్డ్ ఇంకా స్పందించలేదు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.