logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

సీఎం జగన్ పై పీపుల్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయమూర్తి ప్రశంసల జల్లు కురిపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో ఏ రాష్ట్రాల్లో లేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని ప్రజల కోసం పని చేసే ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు.

జగన్ సారథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుండటం సంతోషకరమన్నారు. గతంలో తూర్పుగోదావరి, విశాఖపట్నం సరిహద్దులోని మెట్ట ప్రాంతాల్లో ఒక్క పంట పండటమే కష్టంగా ఉండేదని ఏలేరు తాండవ రిజర్వాయర్లు ఉన్న అదే పరిస్థితులు కొనసాగాయన్నారు. ఈ సమస్యను గుర్తించిన జగన్ ఏలేరు నీటిని తాండవకు అనుసంధానం చేసి భవిష్యతులో సాగునీటికి కొరత లేకుండా చేశారన్నారు.

ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే సీఎం జగన్ కు తాను ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కాగా గతంలో ఉత్తరాంధ్రలో 50 శాతానికిపైగా మెట్ట ప్రాంతాలు ఉన్నాయని, దీంతో ఈ ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస పోతున్నారని ఆర్.నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

తాండవ రిజర్వాయర్‌ నుంచి మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. కాగా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 500 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు అనుసంధానంతో మెట్ట ప్రాంత రైతులు ఎదుర్కుంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించినట్టయ్యింది.

Related News