logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

పివి సింధు సంచలన ట్వీట్.. నెటిజన్ల అసహనం

భారత బాడ్మింటన్ క్రేడాకారిని పివి సింధు సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆమె అభిమానులతో పాటుగా నెటిజన్లకు కూడా అసహనం తెప్పించింది. ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ముందుగా ‘నేను రిటైర్ అవుతున్నా డెన్మార్క్ ఓపెన్ నా చివరి మ్యాచ్’ అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ తో ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే సింధు ఆటకు రిటైర్మెంట్ పలకడం ఏమిటని ఆందోళన చెందారు.

అనంతరం ఆమె మరో సుదీర్ఘ పోస్టును రాసుకొచ్చారు. అందులో తన పోస్టును పూర్తిగా వివరించారు. విశ్రాంతి లేని ఆటకు స్వస్తి పలకలనుకుంటున్నాను. నెగిటివిటీ, భయం, అనిషిచి అనే పదాలకు రిటైర్మెంట్ పలకబోతున్నాని ఆమె పేర్కొన్నారు. కరోనా తనకు ఓ కనువిప్పుగా మారిందన్నారు. ఇంటి లోపలికి వెళ్లాలన్నా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని సింధు తన పోస్టులో పేర్కొన్నారు.

కొన్ని నెలలుగా కరోనా కారణంగా ఇంటికే పరిమితమయ్యానని డెన్మార్క్ ఓపెన్ లో తన దేశ తరపున ప్రాతినిధ్యం వహించలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేసారు. తానెప్పుడూ ఆటలో శక్తివంచన లేకుండా కృషి చేశానన్నారు. ఇకముందు కూడా అదే తీరు కొనసాగిస్తామన్నారు. కానీ కంటికి కనిపించని వైరస్ తో ఎలా పోరాడటం ఎలా?

ఈ పరిస్థితులను మనమంతా కలిసికట్టుగా ఎదుర్కోవలసిన అవసరం ఉందని తెలిపారు. అయితే ఈ పోస్టును పూర్తిగా చదివిన తర్వాత ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమెపై అసహనం వ్యక్తం చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సింధు పోస్ట్ పై ఫన్నీ మీమ్స్ ను చేసి ట్రోల్ చేస్తున్నారు.

Related News