logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

నాకు కరోనా వస్తే నేరుగా అక్కడికే వెళతాను.. పువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. రోజుకు 15 వందల కొత్త కేసులతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నేడు రాష్ట్రం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందని విమర్శిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విమర్శలపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.

కరోనా చెప్పి రాలేదు. ఇదొక ఉపద్రవంలా ప్రపంచాన్ని ముంచేసింది. యూరప్ లాంటి దేశాల్లో ఉన్నంత తీవ్ర మన దగ్గర లేదు. అయినా కరోనా కట్టడి భారత్ లాంటి అత్యధిక జనాభా గల దేశాల్లో చాలా కష్టం. ప్రజలు భౌతిక దూరం పాటించరు. అయినా కూడా తెలంగా రాష్ట్రం కరోనా కట్టడికి సమర్థవంతంగా పనిచేస్తుంది. మన రాష్ట్రంలో రికవరీ రేటు అధికంగా ఉంది. కరోనా మరణాల రేటు చాలా తక్కువ. నిజానికి వృద్దులు కూడా కరోనా నుంచి కోలుకుంటున్నారు.

కానీ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. కాబట్టి మీడియా పాజిటివ్ వార్తలు రాయాలి. కొన్ని అపోహల కారణంగా సమాజంలో కరోనా సోకిన వక్తులను వెలి వేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ప్రభుత్వం వైఫల్యం చెందిందని వ్యాఖ్యానించే వారిని బాధ్యత లేని రాజకీయనాయకులుగా పేర్కొన్నారు. ఈ విమర్శలు చేసే వారికి బుద్ధి చెప్పాలి.

కరోనా కట్టడిలో ముందు విఫలమైంది కేంద్ర ప్రభుత్వమే. మన రాష్ట్రం కొనుగోలు చేసిన పరికరాలను వెస్ట్ బెంగాల్ కు తరలించింది. ఒక వేళ నాకు కరోనా వస్తే నేనేమి భయపడను. నేరుగా గాంధీకి వెళ్లి చికిత్స తీసుకుంటాను అని మంత్రి పువ్వాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Related News