లాయర్ వామన్ రావు దంపతుల హత్యతో మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడ్పి ఛైర్మెన్ పుట్టా మధు పాత్ర ఉందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పుట్ట మధు పాత్రపై విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీని హత్యకు అవసరమైన వాహనం, ఆయుధాలను సమకూర్చినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై పుట్టా మధు ఖండించారు. తాను వజ్రం లాంటివాడినని వ్యాఖ్యానించారు. నేను పరారీలో ఉన్నానని, కేసీఆర్, కేటీఆర్ నాకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదనే ప్రచారం చేస్తున్నారు. నేనసలు హైదరాబాదే వెళ్లలేదన్నారు. నాపై ఎందుకీ పగలు, కుట్రలు అంటూ మండిపడ్డారు.
వామన్ రావు దంపతుల హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. నేను ఎమ్మెల్యే కావడం, జెడ్పి ఛైర్మెన్ కావడం చూసి ఓర్వలేకనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్ ఎంతమందినైనా కొనగలడని అన్నారు.