logo

ఎన్ని సినిమాలు తీసినా పూరి కెరీర్ లో బెస్ట్ అదేనట!

టాలీవుడ్ రూపురేఖలు మార్చిన దర్శకులలో పూరి జగన్నాథ్ పేరు ప్రస్తావించుకోవలసిందే. ఓ సమయంలో ఇండస్ట్రీ హిట్స్ అందించిన పూరి ఆయన కెరీర్ పరంగా మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు. 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ కు ‘బద్రి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు అందించిన ఈ దర్శకుడు ఆ తర్వాత ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘ఇడియట్’ సినిమాలతో మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

దశాబ్దంన్నర కొందట వచ్చిన ‘పోకిరి’ టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన సినిమాగా నిలిచింది. పోకిరి తర్వాత కెరీర్ లో కొంత డౌన్ ఫాల్ చూసినా బిజినెస్ మ్యాన్, టెంపర్ సినిమాలతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేసాడు. తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి మాస్ మసాలా సినిమాతో భారీ హిట్టందుకున్నాడు పూరి. ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

కాగా ఈ సినిమాకు సంబందించిన ఒక ఆసక్తికర ట్వీట్ చేసాడు పూరి. తాను ఎన్ని సినిమాలు చేసినా చివరగా తన కెరీర్ లో బెస్ట్ సినిమా గా ‘ఫైటర్’ నిలుస్తుందని చెప్పడం విశేషం. పూరి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఈసారి మరో బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్నారు అభిమానులు. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తున్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్నఈ సినిమాకి కారం జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Related News