logo

  BREAKING NEWS

రాబిన్ శ‌ర్మ‌తో చంద్ర‌బాబు ఒప్పందం..! ఆయ‌న ట్రాక్ రికార్డ్ తెలుసా..?  |   Breaking: వ‌ర‌ద బాధితుల‌కు భారీ సాయం ప్ర‌క‌టించిన కేసీఆర్‌  |   టీడీపీ క‌మిటీల నియామ‌కం.. లోకేష్‌, బాల‌య్య‌, సుహాసినికి కీల‌క ప‌ద‌వులు  |   బిగ్ బ్రేకింగ్‌: రెండు రాష్ట్రాల‌కు టీడీపీ అధ్య‌క్షుల నియామ‌కం  |   వ్యాక్సిన్ వ‌చ్చినా క‌రోనా ఇక ఎప్ప‌టికీ మ‌న‌తోనే ఉంటుంద‌ట‌  |   పాకిస్థాన్‌ వ‌ల్ల మ‌న పానీపూరీ రేట్లు పెరుగుతున్నాయి తెలుసా ?  |   హ‌య‌త్‌న‌గ‌ర్ టీఆర్ఎస్‌ కార్పొరేట‌ర్‌ను గ‌ల్లా ప‌ట్టి కొట్టిన మ‌హిళ‌లు  |   వ‌ర్షాన్ని ఎలా కొలుస్తారు ? మ‌ల్లీమీట‌ర్లు, సెంటీమీట‌ర్ల‌లోనే ఎందుకు కొలుస్తారు ?  |   ఈ సింపుల్ చిట్కాల‌తో సులువుగా పొట్ట త‌గ్గించుకోవ‌చ్చు  |   జ‌గ‌న్ మాత్ర‌మే కాదు.. ఎన్టీఆర్‌, చిరంజీవిని దించిన నాగ‌బాబు  |  

ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు

ప్ర‌జ‌లంద‌రూ బ్యాంకింగ్ సేవ‌లు వినియోగించుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒక కొత్త స‌ర్వీసును ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ప్రారంభించాయి. వృద్ధులు, దివ్యాంగులు ఇక నుంచి బ్యాంకుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ఇంటి వ‌ద్దకే బ్యాంక్ సిబ్బంది వ‌చ్చే హోం బ్యాంకింగ్ విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇటీవ‌ల ప్రారంభించారు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధులు బ‌య‌ట‌కు వెళ్ల‌డం మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్న నేప‌థ్యంలో ఈ కొత్త సేవ‌లు వృద్ధులకు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. దివ్యాంగులు సైతం బ్యాంకుకు వెళ్లాల్సిన బాధ త‌ప్పుతుంది.

హోం స‌ర్వీసు ఎలా పొందాలి ?
ఈ స‌ర్వీసు పొంద‌డానికి ముందుగా దివ్యాంగులు, 70 ఏళ్లు పైబ‌డిన వృద్ధులు వారి ఖాతా ఉన్న బ్యాంకుకు హోం స‌ర్వీసు కోసం ఒక ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. బ్యాంకు కాల్ సెంట‌ర్‌, మొబైల్ యాప్‌, బ్యాంకు వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న త‌ర్వాత‌ బ్యాంకు టైమింగ్స్‌లో ఏ స‌మ‌యంలో త‌మ‌కు ఏ స‌ర్వీసు కావాలో కాల్ సెంట‌ర్‌కు ఫోన్ చేసి లేదా మొబైల్ యాప్‌, వెబ్‌సైట్ ద్వారా అడ‌గాలి. అప్పుడు బ్యాంకు వారు స‌ర్వీస్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి కేస్‌ ఐడీ, స‌ర్వీస్ కోడ్‌, రిక్వెస్ట్ టైప్ వంటి వివ‌రాల‌ను మెసేజ్ పంపిస్తారు. ఆ త‌ర్వాత మీరు అడిగిన టైమ్‌లో, మీరు కోరిన బ్యాంకింగ్‌ స‌ర్వీస్ ఇవ్వ‌డానికి బ్యాంకు నుంచి ఒక ఉద్యోగి మీ ఉంటికి వ‌స్తారు.

ఎక్క‌డైనా హోం బ్యాంకింగ్ సేవ‌లు పొంద‌వ‌చ్చా ?
మీ ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచ్‌ నుంచి ఐదు కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్న వారికే హోం స‌ర్వీస్ చేస్తాయి బ్యాంకులు. అంతేకాదు, మీ బ్యాంకు అకౌంట్‌కు సంబంధించి రిజిస్ట‌ర్ అయి ఉన్న అడ్ర‌స్‌కు మాత్రమే ఈ స‌ర్వీస్ ఇస్తాయి. మీరు వేరే అడ్ర‌స్‌లో స‌ర్వీస్ కావాలంటే ఇవ్వ‌రు.

ఏయే సేవ‌లు పొంద‌వ‌చ్చు ?
ఫైనాన్షియ‌ల్‌, నాన్ ఫైనాన్షియ‌ల్ సేవ‌ల‌ను హోం స‌ర్వీస్ ద్వారా పొంద‌వ‌చ్చు. చెక్‌ల‌ను, డీడీల‌ను అందించ‌వ‌చ్చు. అకౌంట్ స్టేట్‌మెంట్ల‌ను తెప్పించుకోవ‌చ్చు. బ్యాంకుల‌కు ఇవ్వాల్సిన ఏవైనా ఫామ్‌లు ఇవ్వ‌డంతో, బ్యాంకు నుంచి పొందాల్సిన ఫామ్‌ల‌ను హోం స‌ర్వీస్‌కు వ‌చ్చే బ్యాంకు సిబ్బంది ద్వారా తీసుకోవ‌చ్చు. ఫైనాన్షియ‌ల్ ట్రాన్సాక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే ఇంటి ద‌గ్గ‌రే డ‌బ్బులు డిపాజిట్ చేయ‌డంతో పాటు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

హోం స‌ర్వీస్‌కు ఛార్జీలు వేస్తారా ?
బ్యాంకింగ్ సేవ‌ల‌ను ఇంటి వ‌ద్ద‌కు వెళ్లి అందిస్తే బ్యాంకులు ఛార్జీ చేస్తాయి. ఒక్కో బ్యాంకు ఒక్కోర‌కంగా ఛార్జీలు విధిస్తాయి. ఎస్‌బీఐ విష‌యానికి వ‌స్తే ఒక్క విజిట్‌కు రూ.75 ఛార్జీ చేస్తారు. యూనియ‌న్ బ్యాంక్ అయితే ఒక్క విజిట్‌కు రూ.200 వేస్తారు. జీఎస్‌టీ కూడా అదనం. హోం స‌ర్వీస్ ఛార్జీని మీ ఇంటికి వ‌చ్చే స‌ర్వీస్ ఏజెంట్‌కు ఇవ్వాలి లేదా అకౌంట్ నుంచి క‌ట్ చేసుకుంటారు.

ట్రాన్సాక్ష‌న్ చేయ‌డానికి ఏమైనా ప‌రిమితులు ఉంటాయా ?
హోం బ్యాంకింగ్‌లో ట్రాన్సాక్ష‌న్ చేయ‌డానికి సంబంధించి బ్యాంకులు ప‌రిమితులు విధించాయి. ఎస్‌బీఐ విష‌యానికి వ‌స్తే.. విత్‌డ్రా చేయాల‌నుకున్నా, డిపాజిట్ చేయాల‌నుకున్నా మినిమం వెయ్యి రూపాయ‌లు చేయాలి. ఎక్కువ‌గా రూ.20 వేల వ‌ర‌కు చేయ‌వ‌చ్చు. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మినిమం రూ.5 వేలు, మ్యాగ్జిమం రూ.25 వేల వ‌ర‌కు హోం బ్యాంకింగ్ ద్వారా ట్రాన్సాక్ష‌న్ చేయ‌వ‌చ్చు.

నిజ‌మైన బ్యాంక్ ఏజెంట్‌ను ఎలా గుర్తించాలి ?
హోం బ్యాంకింగ్ స‌ర్వీస్ అందించ‌డానికి వ‌చ్చే వ్య‌క్తులు నిజంగానే బ్యాంక్ నుంచే వ‌చ్చారా అని గుర్తించాలి. ఇందుగానూ మీరు స‌ర్వీస్ రిక్వెస్ట్ పెట్టిన‌ప్పుడు మీ మొబైల్‌కు వ‌చ్చే కేస్ ఐడీ, స‌ర్వీస్ కోడ్ వంటి వివ‌రాల‌ను, ఏజెంట్ ద‌గ్గ‌ర ఉన్న వివ‌రాల‌ను పోల్చి చూసుకోవాలి. స‌ర్వీస్ ఏజెంట్ కూడా మిమ్మ‌ల్ని గుర్తించ‌డానికి ఏదైనా ఐడీ ప్రూఫ్ అడుగుతాడు. మీరు ఇచ్చే చెక్‌, క్యాష్‌ను మీ ముందే స‌ర్వీస్ ఏజెంట్ క‌వ‌ర్‌లో సీల్ చేస్తాడు. మీ ఏటీఎం పిన్ వంటి వివ‌రాల‌ను స‌ర్వీస్ ఏజెంట్‌కు చెప్ప‌కూడ‌దు.

Related News