logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

వావివరసలు మరిచిన న్యాయవాది.. కన్న కూతురిపైనే అఘాయిత్యం

పవిత్రమైన న్యాయవాది వృత్తిలో ఉంటూ ఆ వృత్తికే కళంకం తెచ్చాడో దుర్మార్గుడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురిపైనే కన్నేశాడు. తండ్రి వేధింపులు భరించలేని బాలిక ఆత్మహత్యకు యత్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా హైదర్‌షాకోట్‌, కపిల నగర్ కాలానికి చెందిన సత్యనారాయణ గౌడ్ వరంగల్ జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

పదో తరగతి చదువుతున్న కూతురిపై కనేసాడు. బాలికను బెదిరించి తరచు ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఇటీవల తండ్రి వేధింపులు ఎక్కువ కావడంతో బాలిక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తల్లి కూతురిని నిలదీసి అడగడంతో తండ్రి వేధింపుల గురించి చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి షాక్ కు గురైంది. వెంటనే భర్తపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తండ్రి నుంచి తన బిడ్డకు రక్షణ లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అతనికి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

Related News