logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

సైకో రాజు కేసులో సంచలన విషయాలు.. అతనితో ఉంటున్న ఆ మైనర్ బాలిక ఎవరు?

విశాఖలో ఆదివారం రోజున చోటుచేసుకున్న ఓ ఘటన కలకలం రేపుతోంది. సైకో రాజుగా పిలుస్తున్న ఓ యువకుడు మనిషి పుర్రెను తీసుకువచ్చి కాల్చుకు తినేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఒళ్ళు జలదరించే ఈ ఘటన పాత నగరంలోని రెల్లి వీధిలో చోటుచేసుకుంది. కాగా నిన్న అతన్ని అరెస్టు చేసిన పోలీసులు అతనితో పాటు ఆ గదిలో ఉంటున్న మరో మైనర్ బాలికను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో రాజును విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఆ పుర్రెను మెడికల్ కాలేజీ నుంచి తెచ్చినట్టుగా చెప్పాడు. అంతేకాదు తాను శివ భక్తుడినని అందుకే పుర్రెను తెచ్చి పూజిస్తే మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఇలా చేసానని దానిని తినడానికి కాదని చెప్పాడు. కాగా నిందితుడిని పోలీసులు ఈరోజు కోర్టులో హాజరుపరచనున్నారు.

ఐదేళ్ల క్రితం రాజు తండ్రి అనారోగ్యంతో మరణించాడని, అతని తల్లి కొడుకు విపరీతమైన ప్రవర్తనను తట్టుకోలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయి మరో ప్రాంతంలో ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతనికి ఒక సోదరి ఉండగా వివాహం చేసుకుని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో అడిగేవారు ఎవరూ లేకపోవడంతో రాజు చెడు వ్యసనాలకు బానిసగా మారాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలకు కూడా పాల్పడేవాడు.

కాగా ఈ కేసులో అతనితోపాటుగా ఉంటున్న మైనర్ బాలికను విచారణ అనంతరం పోలీసులు విడిచిపెట్టారు. అయితే అసలు ఆ బాలిక ఎవరు? అతనితో ఆ గదిలో ఎందుకు ఉంటుంది? అనే విషయాలు మిస్టరీగా మారాయి. పోలీసులు ఈ విషయాల్ని వెల్లడించవలసి ఉంది.

Related News