logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ఇస్రో ఖాతాలో మరో విజయం: పీఎస్ఎల్‌వి-సీ49 విజయవంతం

ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్‌వి-సీ49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా మొత్తం 10 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్య లోకి పంపింది ఇస్రో. మొదట భారత్ కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈవోఎస్-01) ను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ఇది వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం చేయనుంది. 15 నిమిషాల అనంతరం మిగిలిన 9 ఉపగ్రహాలను పీఎస్ఎల్‌వి-సీ49 ఆర్బిటల్ లోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడం పై ఇస్రో ఛైర్మెన్ శివన్ హర్షం వ్యక్తం చేసారు. శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు.

కాగా పీఎస్ఎల్‌వి-సీ49 ప్రయోగానికి ముందు భారీ వర్షాల కారణంగా 10 నిమిషాల పాటు ఆలస్యం జరిగింది. అనంతరం 3: 12 నిమిషాలకు నింగిలోకి పంపించారు.

Related News