logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ

కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ లక్షన్లు తీవ్రంగా ఉంటున్నాయి. గతంలో కన్నా ఈ దశలో కరోనా బారిన పడినవారిలో శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి వారికోసం కేంద్ర ఆరోగ్య శాఖ పలు విషయాలను సూచించింది. ఎవరైతే కరోనా బారిన పడి స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారో వారంతా ప్రోనింగ్ పద్దతులను పాటించాలని తెలిపింది.

శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు 94 కన్నా తక్కువగా ఉంటె వారు వీపును నేలకు ఆనించి పడుకోవడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఊపిరితీయతులపై ఒత్తిడి పెరిగి పూర్తిగా శ్వాసను తీసుకోలేవు. పొట్టను నేల భాగానికి ఆనించి బోర్లా పడుకుని, లేదా ఒక పక్కకు ఒరిగి పడుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలి. ఇలా చేయడం వలన ఊపిరితిత్తులకు శ్వాస బాగా అందుతుంది. దీంతో వీటి పనితీరు మెరుగుపడుతుంది. ఇలా చేయడాన్ని ‘ప్రోనింగ్’ అంటారని తెలిపింది.

వైద్య విధానంలో ప్రోనింగ్ అనేది ఒక భాగం. కరోనా రోగులు ఈ భంగిమలో అరగంట నుంచి 2 గంటల వరకు ఉండవచ్చు. అయితే ఇలా చేసేవారు కనీసం నాలుగైదు దిండ్లను ఉపయోగించాల్సి ఉంటుంది. గొంతు, ఛాతి , పొట్ట, కాళ్ళు వంటి భాగాలపై ఒత్తిడి పడకుండా ముందుగా దిండును వేసుకుని ఆ తర్వాత ఇలా పడుకోవడం మంచిదని తెలిపింది. హోం ఐసోలేషన్‌లో దీన్ని చేసేవారు శరీర ఉష్ణోగ్రత, బీపీ, షుగర్ వంటి వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

గుండె, వెన్నుముక సమస్యలతో బాధపడేవారు, గర్భిణీలు ప్రోనింగ్ ను చేయవద్దని సూచించింది. రోజులో ఏ సమయంలోనైనా ప్రోనింగ్ చేయవచ్చు. అయితే భోజనం చేసిన తర్వాత గంట విరామం తర్వాతనే దీనిని ప్రయత్నించాలని ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రోనింగ్ చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెరుగుతాయని, దీనివల్ల శ్వాస సంబంధ ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయని పేర్కొంది.

 

Related News