logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ కు హత్యా బెదిరింపులు!

మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెషర్ నాగేశ్వర్ కు హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ నెల 25న కొందరు వ్యక్తులు ఆయనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నానని, తనను చంపుతామంటూ కొందరు ఆగంతకులు బెదిరించారని తెలిపారు. ఒకే రోజు ఏడు సార్లు వారి నుంచి ఇలాంటి కాల్స్ వచ్చినట్టుగా తెలిపారు.

ఆ వ్యక్తులు ఇంటర్ నెట్ ను ఉపయోగించి వాయిస్ కాల్స్ చేస్తున్నారని తెలిపారు. అయితే ఈ విషయంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ వెంటనే హ్యాక్ ఐ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసారు. కాగా 12 రోజులైనా తన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన లేకపోవడంపై నాగేశ్వర్ మండిపడ్డారు. రాష్ట్రంలో తనలాంటి వారి పరిస్థితే ఇలా ఉంటె ఇక సామాన్య ప్రజల సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని డీజీపీ, హైదరాబాద్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తానన్నారు.

అయితే తనకు వచ్చిన హత్యా బెదిరింపులకు తాను ఏమాత్రం భయపడనని ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ప్రజా సమస్యలపై గళం విప్పుతానని ప్రొఫెసర్ నాగేశ్వర్ తేల్చి చెప్పారు. సాధారణంగానే సామజిక, రాజకీయ, సమకాలీన అంశాలపై ఎంతో అవగాహనతో విశ్లేషిస్తారనే విషయం తెలిసిందే. కాగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ను ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్వహిస్తున్నారు. దాని ద్వారా ప్రతి రోజు వివిధ అంశాలపై తన విశ్లేషణలు పంచుకుంటున్నారు. ఆ కారణంగానే తనకు ఈ హత్యా బెదిరింపులు వస్తున్నాయని అయన అభిప్రాయ పడ్డారు.

Related News