logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం

మలి ద‌శ ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కమైన వ్య‌క్తులు కేసీఆర్‌, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం. ప్ర‌త్యేక రాష్ట్ర‌మే ల‌క్ష్యంగా పార్టీని స్థాపించి, ఉద్య‌మానికి ఊపిరిలూదిన నాయ‌కులు కేసీఆర్‌. ప్ర‌జా సంఘాలు, రాజ‌కీయ పార్టీల‌ను ఏక‌తాటిపైకి న‌డిపించి ఉద్య‌మాన్ని ఉదృతం చేసిన ఉద్య‌మ‌నేత కోదండ‌రాం. ఇద్ద‌రూ ఇద్ద‌రే. తెలంగాణ భౌగోళిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక‌, సామాజిక ప‌రిస్థితుల‌పై ఈ ఇద్ద‌రికి సంపూర్ణ అవ‌గాహ‌న ఉంది. అందుకే ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించ‌డంలో విజ‌యం సాధించారు.

నిజానికి తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్‌, కోదండ‌రాం ఇద్ద‌రూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఉద్య‌మ స‌మ‌యంలో ఇద్ద‌రు నేతల మ‌ధ్య స‌త్సంబంధాలు ఉండేవి. ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌, నిర్ణ‌యాలకు సంబంధించి ఇద్ద‌రూ క‌లిసే నిర్ణ‌యం తీసుకునే వారు. ఈ క్ర‌మంలో కోదండ‌రాంపై సీమాంధ్ర నేత‌లు ఎవ‌రైనా ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడు కేసీఆర్ తీవ్రంగా ఖండించేవారు. ఒకానొక స‌మ‌యంలో అయితే కోదండ‌రాం బంగారు ముద్ద లాంటోడ‌ని సైతం కేసీఆర్ కొనియాడారు.

ఇద్ద‌రి మ‌ధ్య ఇంత మంచి అనుబంధం తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ్డ త‌ర్వాత చెడిపోయింది. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఉద్య‌మంలో కీల‌కంగా ప‌ని చేసిన ఉద్యోగ‌, ప్ర‌జా సంఘాల నేత‌లు కొంద‌రు టీఆర్ఎస్‌, కాంగ్రెస్ వైపు వెళ్లిపోయారు. కోదండ‌రాం మాత్రం రాజ‌కీయాల్లోకి వెళ్లకుండా తెలంగాణ జేఏసీని కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇదే క్ర‌మంలో తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేసీఆర్‌తో కొంత‌కాలానికే కోదండ‌రాంకు విభేదాలు వ‌చ్చాయి.

ఒకానొక స‌మ‌యంలో ప్ర‌భుత్వంపై కోదండరాం విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేక‌పోయింది. కోదండ‌రాంపై ప్ర‌త్యారోప‌ణ‌లు చేసింది. దీంతో కేసీఆర్‌, కోదండ‌రాం మ‌ధ్య మ‌ళ్లీ క‌ల‌వ‌లేనంత‌గా దూరం పెరిగింది. ఒక‌ప్పుడు కోదండ‌రాంను పొగిడిన టీఆర్ఎస్ నాయకులే విమ‌ర్శ‌లు చేశారు. కోదండ‌రాం కూడా పూర్తిగా ప్ర‌భుత్వ వ్య‌తిరేకిగా మారిపోయారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని స్థాపించి ప్ర‌జాకూట‌మిలో చేరి టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా పోరాడి విఫ‌ల‌మ‌య్యారు.

అయితే, ఒక‌ప్పుడు క‌లిసి ఉద్య‌మించిన కేసీఆర్‌, కోదండ‌రాం ఎందుకు దూర‌మ‌య్యార‌నేది మాత్రం ప్ర‌శ్న‌గానే మిగిలిపోయింది. ఈ ప్ర‌శ్న‌కు తాజాగా కోదండ‌రాం స‌మాధానం చెప్పారు. రాష్ట్రం ఆవిర్భ‌వించిన తొలినాళ్ల‌లో చ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని కేసీఆర్ భావించార‌ని, కోట్లాది రూపాయ‌లు న‌ష్టం చేసే ఈ ప‌ని చేయొద్ద‌ని తాను అన్నందుకే ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు మొద‌లయ్యాయ‌ని కోదండ‌రాం ఇటీవ‌ల త‌న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పారు.

అయితే, కోదండ‌రాం చెప్పిన ఈ విష‌యంపైన టీఆర్ఎస్ స్పందించ‌లేదు. కానీ, విద్యుత్ విష‌యంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం స‌ఫ‌ల‌మైంది. తెలంగాణ ఏర్ప‌డితే అంధ‌కార‌మే అని అన్న వారే ఆశ్చ‌ర్య‌పోయేలా విద్యుత్ కోత‌లు లేని రాష్ట్రంలో తెలంగాణ‌ను కేసీఆర్ మార్చారు. ఈ విష‌యంలో కేసీఆర్ స‌క్సెస్ అయ్యార‌ని మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా త‌ర్వాత అంగీక‌రించారు. తెలంగాణ వ‌స్తే అంధ‌కార‌మే అని కిర‌ణ్ కుమార్ రెడ్డి గ‌ట్టిగా వాధించిన విష‌యం తెలిసిందే.

Related News