logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

నమ్రత పోస్టుపై హర్ట్ అయిన నిర్మాత… మహేష్ కు ట్వీట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు- గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నమ్రత తన ఇంస్టాగ్రామ్ పోస్టు లో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె ట్వీట్ పై ఒక్కడు సినిమా నిర్మాత ఎం ఎస్ రాజు హర్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ ట్వీట్ లో సినిమాకు పని చేసిన అందరి పేర్లను చేర్చిన నమ్రత సినిమా నిర్మాత ఎం ఎస్ రాజు పేరును చేర్చడం మర్చిపోయారు.

అది గమనించిన ఆయన ఈ విషయాన్ని మహేష్ కు తెలిసేలా ట్వీట్ చేసారు. ”మహేష్.. నమ్రత నా పేరు చేర్చడం మర్చిపోయారు. అయినా ఒక్కడు సినిమాను క్లాసిక్ గా పేర్కొనడం నాకు సంతోషంగా ఉంది. గుడ్ లక్” అంటూ ఆయన ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో నమ్రత వెంటనే ఎం ఎస్ రాజు పేరును కూడా తన పోస్టు లో చేర్చారు.

అయితే ఈ సందర్భంగా సినిమా హీరోయిన్ భూమిక చావ్లా ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంఎస్ రాజు గారికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’ లాంటి అద్భుతమైన సినిమాలను టాలీవుడ్ కి అందించిన ఈ నిర్మాత తర్వాత కొంత విరామం తీసుకుని సినిమాలకు దూరమయ్యారు. తాజాగా ‘డర్టీ హరి’ పేరుతో ఓ ఎరోటిక్ టచ్ ఉన్న సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు.

Related News